ప్రపంచంలో పెరుగుతున్న కతోలికుల సంఖ్య.. తాజా గణాంకాలు విడుదల

జోసెఫ్ అవినాష్

26 Oct 2026

వాటికన్‌కు చెందిన ఫిదెస్ వార్తా సంస్థ విడుదల చేసిన 2026 కతోలిక సంఘ గణాంకాల నివేదిక ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా కతోలికుల సంఖ్య 1.422 బిలియన్లకు (142.2 కోట్లు) చేరుకుంది. గత ఏడాదితో పోలిస్తే 1.669 కోట్ల మంది కతోలికులు పెరిగారు. ప్రపంచ జనాభాలో కతోలికులు 17.8 శాతంగా ఉన్నారు. ఆఫ్రికా, అమెరికా ఖండాల్లో అత్యధికంగా కతోలికుల సంఖ్య పెరిగింది. ఆసియా, యూరప్‌, ఓషియానియా ఖండాల్లోనూ ఈ పెరుగుదల నమోదైంది.
ప్రపంచవ్యాప్తంగా పీఠాధిపతుల సంఖ్య 5,525కు చేరుకోగా, గురువుల సంఖ్య ఐదేళ్ల తర్వాత తొలిసారిగా పెరిగి 4,07,421కు చేరింది. అయితే, కన్యా స్త్రీల సంఖ్య 5,80,131కు తగ్గింది. గురు విద్యార్థుల సంఖ్య 1,97,645 కాగా, ఉపదేశల సంఖ్య 28,89,336 కు చేరింది. కతోలిక వైద్య సేవ కేంద్రాల సంఖ్య 19,043 కాగా కతోలిక విద్యాలయాల సంఖ్య 2,30,924 కు చేరింది.2026 అక్టోబర్ 18న జరుపుకున్న ప్రపంచ వేద వ్యాపక ఆదివారాన్ని పురస్కరించుకుని ఫిదెస్ సంస్థ ఈ గణాంకాలను విడుదల చేసింది.

Subscription

You do not have an active subscription. Subscribe Below


Welcome User

Signup/Login with your Phone Number to continue with Bharathamithram
LOGIN