స్త్రీలను ఎదగనివ్వాలి, బలపడనివ్వాలి

జోసెఫ్ అవినాష్
25 Oct 2026
సామాన్య 30వ సోమవారం
సువిశేష ధ్యానం:
లూకా 13:10-17
ధ్యానం: స్త్రీ విముక్తికి సహకారం
యేసు ఆమెను పిలచి, "ఓ స్త్రీ! నీవు రోగమునుండి విముక్తి పొందితివి" అనగా, అపవిత్రాత్మచే పీడింపబడుచున్న ఆమె తక్షణమే తిన్నగా నిలబడెను (లూకా 13:12-13), ఈ స్త్రీ కేవలం 18 సం॥రాలు అపవిత్రత్మచే పీడింపబడెను. మన చుట్టు పరిశీలించి చూస్తే ఎందరో స్త్రీలు ఏళ్ళ తరబడి, జీవితాంతం అరాచకాలకు గురౌతున్నారు. కొన్ని వ్యక్తిగతంగా మనం చేసినవైతే, సామాజిక అరాచకాలు మరెన్నో. పోపు ఫ్రాన్సీసుగారు సినడ్ ప్రక్రియలో సూచించిన విధంగా శ్రీసభలో స్త్రీలకు ప్రాధాన్యత నిచ్చి, వారి విముక్తికి ప్రతి ఒక్కరు సహకరించాలి. వారి విముక్తి త్వరగా కలిగేది ఉన్నతమైన చదువు ద్వారానే. సువిశేషంలోని స్త్రీ వలే ఎందరో వనితలు తిన్నగా నడువలేక, నిలబడలేక వంగిపోయి పీడింపబడుచున్నారు. శ్రీసభ వారి పక్షాన ఉండాలి. ప్రభువు పూర్తిగా వారి పక్షాన నిలబడ్డారు. మన విచారణలలో, గ్రామాలలో ప్రతి బాలిక ఉన్నత విద్య వత్రము సంపాదించుటకు మనందరం శ్రమించి సహాకరించాలి. పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులులాంటి కపట భక్తులు మన సమాజంలో లేకపోలేదు. • 18 సం||రాలు స్త్రీ బాధకన్న వారికి విశ్రాంతి దిన విషయం ప్రధానమైపోయింది. దశాబ్దాలుగా, శతాబ్దాలుగా శ్రీసభలో, సమాజంలో స్త్రీలను చిన్నచూపు చూస్తూనే ఉన్నాము. ఇది ఇంకా కొనసాగకూడదు. స్త్రీలను ఎదగనివ్వాలి, బలపడనివ్వాలి. వారికి ప్రాధాన్యత కలిగించి, వారి స్వరాన్ని వినాలి. చిన్న వయస్సులో వివాహము, గృహ హింస మొదలగు సామాజిక అన్యాయాలకు తెరదించి స్త్రీ విముక్తి క్రీస్తువలే అన్ని విధాలా కృషిచేయాలి, సహకరించాలి.
