సత్యం, కరుణతో కూడిన న్యాయమే శ్రీసభ చట్టాల లక్ష్యం: పోప్
జోసెఫ్ అవినాష్
24 Oct 2026
2026 అక్టోబర్ 23న, పొంతిఫికల్ గ్రెగోరియన్ విశ్వవిద్యాలయానికి చెందిన శ్రీసభ చట్టవిద్యా విభాగం సభ్యులతో సమావేశమైన పోప్ లియో XIV, శ్రీసభ చట్టాలు విశ్వాసుల ఆధ్యాత్మిక మేలును,శ్రీసభ ఐక్యతను పెంపొందించేలా ఉండాలని పిలుపునిచ్చారు.శ్రీసభ చట్టాలను అధ్యయనం చేసేవారు కేవలం చట్టాలను తెలుసుకోవడానికే పరిమితం కాకుండా,వాటి వెనుక ఉన్న దైవిక ఉద్దేశాన్ని, న్యాయాన్ని అర్థం చేసుకోవాలని ఆయన సూచించారు.
పొంతిఫికల్ గ్రెగోరియన్ విశ్వవిద్యాలయంలోని చట్టవిద్యా విభాగం 150వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని మాట్లాడుతూ,శ్రీసభలో క్రమశిక్షణను కాపాడటంలో చట్టాలు కీలక పాత్ర పోషిస్తాయని పోప్ వివరించారు.నిజమైన న్యాయం అనేది సత్యం, కరుణల నుంచి ఎన్నడూ వేరుపడకూడదని స్పష్టం చేశారు.అలాగే, శ్రీసభ బోధనలకు విశ్వాసంగా ఉంటూ,పోప్ సేవకు మరియు అపోస్తలిక పీఠానికి నిబద్ధతతో పనిచేయాలని విద్యావేత్తలకు పిలుపునిచ్చారు. రోమ్ పీఠాధిపతి ద్వారా విశ్వవ్యాప్త శ్రీసభ ఐక్యత వ్యక్తమవుతుందని పేర్కొంటూ,విద్యార్థులు తాము పొందిన జ్ఞానాన్ని తాము సేవచేసే విశ్వాస సమాజాల మేలుకోసం వినియోగించాలని ఆయన ఆకాంక్షించారు.
