ప్రార్థనలో గడుపుదాం

జోసెఫ్ అవినాష్

23 Oct 2026

సామాన్య 29వ శనివారం
సువిశేష ధ్యానం:
లూకా 6:12-16
ఈనాడు ప్రత్యేక విధముగా మన శ్రీసభ మనకు ఇచ్చు ధ్యానాంశం క్రీస్తు ఏసు రాత్రంతా తండ్రి దేవునితో ఐక్యమై ప్రార్ధనలో గడిపి, మరియు పన్నెండు మంది శిష్యులను పిలిచి, ఎన్నుకోవటం తెలియజేస్తుంది. తండ్రి దేవుడు తన యందు ప్రారంభించిన రక్షణకార్యాన్ని శిష్యుల ద్వారా కొనసాగించడం తెలియజేయబడుతుంది. ఆనాడు ఏ విధంగానైతే క్రీస్తు ప్రభువు తన పరిచర్యకు శిష్యులను పిలచి ఎన్నుకున్నాడో అదే విధంగా నేటి ప్రపంచంలో మన మధ్యలో మన కుటుంబాలలో తనకు ప్రీతి పాత్రులుగా జీవించే వారిని పిలుచుకొని, ఎన్నుకొని వారిని ఒక యాజక అంతస్థులో నిలుపుతూ వారి ద్వారా మనలను శ్రీసభ బిడ్డలుగా దేవునికి ప్రియమైన సాక్షులుగా ఎదగడానికి దోహద పడుతున్నారు.

ఈనాటి సువిశేష పఠనం ద్వారా క్రీస్తు ప్రభువు 'ఎన్నిక'కు ఎక్కువ ప్రాధాన్యత నిస్తున్నారు. ఎన్నిక అంటే మనకందరకు తెలిసిన విధంగా 'ఒక గుర్తింపు', క్రీస్తు ప్రభువు ముందుగానే తాను చనిపోతాడని తెలిసి, తన పనిని చేయడానికి, సువార్తను నలుదిశల్లో విస్తరింప చేయడానికి శిష్యులందరిని పిలిచి అందులో పన్నెండు మందిని 'ఎన్నిక' చేసుకొని వారికి ఆయన బాధ్యతలను అప్పగించారు.

ఇక్కడ మనం గ్రహించాల్సిన విషయం ఏమనగా వారిని ఎన్నుకొని పిలవగానే స్పందించి, ఆ పిలుపుకు తగ్గట్టుగా వారి జీవితాలను మార్చుకొని, వారు దేవుని ప్రేమలో, విశ్వాసంలో సూరంతలుగా బలపడ్డారు. 'ఎన్నిక' • అనేది ఒక గొప్పవరం. ఎందుకంటే దీని ద్వారానే క్రీస్తు ప్రభువుకు సన్నిహితులమవుతాము. దేవుని బిడ్డలవుతాము. రోమా 10:15 సువార్తను ప్రకటించు వారి పాదములు ఎంతో సుందరమైనవి. కాబట్టి మనమంతా దేవుని చేత ఎన్నుకొనబడి ఆయన సువార్తను ప్రకటించడానికి, ఆయన ప్రేషిత కార్యంతో పాలుపంచుకుంటూ, సువార్తలో, ప్రగాఢమైన విశ్వాసంలో ఎదగాలని, ప్రతి ఒక్కరూ ప్రార్ధన చేద్దాం. ఆయన దీవెనలు పొందుదాం.

Subscription

You do not have an active subscription. Subscribe Below


Welcome User

Signup/Login with your Phone Number to continue with Bharathamithram
LOGIN