సఖ్యతా భావము కలిగి జీవించే విధంగా మన జీవితాలను మలచుకుందాం

జోసెఫ్ అవినాష్

22 Oct 2026

సామాన్య 29వ శుక్రవారం
సువిశేష ధ్యానం
లూకా 12:54-59
మన జీవితంలో అనేకమైన సమస్యలను ఎదుర్కొంటూ ఉంటాము. ప్రతి ఒక్క సమస్యకు పరిష్కారాన్ని చూస్తూ ఉంటాం. ఏ విధంగా అంటే ఆ పరిష్కారాలను ఒక చిహ్నంగా భావిస్తూ ఉంటాము. లేదా ఒక సంకేతముగా చూస్తాము. ఎందుకంటే మన సమస్యను మనం పరిష్కరించు కోకుండా మూడవ వ్యక్తికి అప్పజెపుతూ ఉంటాము. కానీ మన సమస్యలు మన చేతనే పరిష్కరింపబడాలని ఈనాటి సువిశేష పఠనములో యేసు ప్రభువు మనకు తెలియజేస్తున్నారు.

యేసు ప్రభువు తన బోధనలను వినడానికి గుమికూడిన జనసమూహమును చూసి కలతచెంది. వీరు కాపరి లేని గొర్రెల వలె ఉన్నారు. వీరికి ఒక తోడును సమకూర్చాలి అని తలంచి తమ పొరుగువారిని వారికి ఒక మంచి వ్యక్తులుగా పరిగణించమని యేసు ప్రభువు తెలియపరుస్తూ ఉన్నారు. ఇతరుల పట్ల మీకు ఏమైనా సమస్య ఉన్నట్లైతే దానిని మూడో కంటికి తెలియకుండా సరిచేసుకోండి. ఎందుకంటే వారే మీకు తోడుగా మీ వెన్నంటి ఉండేవారు అని వారికి తెలియజేస్తూ ఉన్నారు. ప్రజలు యేసు ప్రభువు తండ్రి దేవుని కుమారుడని నమ్ముటకై వారు సూచక క్రియలను చూపింపమని అడుగుతున్నప్పుడు యేసు ప్రభువు కోపోద్రిక్తుడై వారిపై మండిపడి అన్నింటికి సూచనలు అవసరం లేదు కానీ పరస్పర సంబంధం కలిగి ఉండటమే మంచిది అని తెలియపరుస్తున్నారు.

భార్యాభర్తలు తమ వైవాహిక జీవితంలో ఒకరి పట్ల ఒకరు ప్రేమ. పరస్పర అను సమాధానం కలిగి జీవించాలి. అలా లేని పక్షాన వారి జీవితం ఒక సూచనల ప్రక్రియగా మారుతూ ఉంటుంది. వారి జీవితాలలోని అనర్థాలకు వారే కారకులవుతుంటారు. ఒకరి పట్ల ఒకరు సఖ్యతా భావం కలిగి లేని యెడల వారు ఒక అమానుషమైన జీవితాన్ని గడిపిన వారవుతారు. జీవితంలో ఎటువంటి కలతలు లేకుండా జీవించాలి అంటే ఒకరిపై ఒకరికి పూర్తి నమ్మకం కలిగి ఉండాలి.కాబట్టి ప్రియ సహోదరులారా! మన జీవితాలలో కూడా మనం ప్రతి చిన్న విషయమై మన స్వభావాన్ని కోల్పోతుంటాము. అలా కాకుండా ఒకరిపట్ల ఒకరు స్నేహ భావము, సఖ్యతా భావము కలిగి జీవించే విధంగా మన జీవితాలను మలచుకుందాం.

Subscription

You do not have an active subscription. Subscribe Below


Welcome User

Signup/Login with your Phone Number to continue with Bharathamithram
LOGIN