పోప్ లియో XIVకు క్యాన్సర్ చికిత్స అవసరం లేదు
జోసెఫ్ అవినాష్
22 Oct 2026
విశ్వకాపరి పోప్ లియో XIVకు ఊపిరితిత్తుల క్యాన్సర్‌కు సంబంధించి ఇకపై ఎలాంటి అదనపు చికిత్స అవసరం లేదని వాటికన్ వైద్యులు వెల్లడించారు. అక్టోబర్ 13న రోమ్‌లోని జెమెల్లి ఆసుపత్రిలో ఆయనకు శస్త్రచికిత్స నిర్వహించి,కుడి ఊపిరితిత్తి దిగువ భాగాన్ని తొలగించారు. అనంతరం నిర్వహించిన కణజాల పరీక్షలు,ఇతర వైద్య పరీక్షల్లో క్యాన్సర్ నిర్దిష్ట ప్రాంతానికే పరిమితమై ఉన్నట్లు నిర్ధారణ అయింది. తదుపరి క్యాన్సర్ వైద్య పరీక్షల అనంతరం మరే ఇతర చికిత్స అవసరం లేదని వైద్యులు స్పష్టం చేశారు.అక్టోబర్ 17న ఆసుపత్రి నుంచి విడుదలైన పోప్,అక్టోబర్ 21న సెయింట్ పీటర్స్ స్క్వేర్‌లో సాధారణ బుధవారం ప్రేక్షకుల సమావేశంలో పాల్గొన్నారు. తన ఆరోగ్యం కోసం ప్రార్థించిన వారందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
