బాల యేసువా నిన్ను నే భక్తి కొలుతు

కొండవీటి అంతయ్య, సత్తెనపల్లి
21 Oct 2026
బాల యేసువా నిన్ను నే భక్తి కొలుతు
*****************************
కనులు తెరచిన మూసిన కమ్మనైన
చిన్ని నీ రూపమేవేళ చిందులాడి
కదిలి నిరతము మనసున మెదలుచుండు
బాల యేసువా!నిన్ను నే భక్తి కొలుతు!
నిండు జాబిలి పోలిక నుండు మోము
పండు వెన్నెల సోనల గుండె తాకు
ముద్దులాడి నీ పాదాల వద్ద చేరి
బాల యేసువా!నిన్ను నే భక్తి కొలుతు!
మొక్కు వారికి గ్రక్కున చిక్కు దీర్చ
గుండెలందున కొలువైయుండ నేర్చి
భువికి దివి నుండి వచ్చిన భూరి తేజ!
బాల యేసువా! నిన్ను నే భక్తి కొలుతు!
