వివాహం, కుటుంబ వ్యవస్థను కాపాడుకోవడం నేటి సమాజానికి అత్యవసరం: పోప్
జోసెఫ్ అవినాష్
21 Oct 2026
వివాహ బంధాన్ని,కుటుంబ వ్యవస్థను కాపాడుకోవడం నేటి సమాజంలో ఎంతో అవసరమని శస్త్రచికిత్స అనంతరం తొలిసారిగా అక్టోబర్ 20న నిర్వహించిన బుధవారం సాధారణ ప్రేక్షకుల సమావేశంలో ఆయన ఈ విషయాలను వెల్లడించారు.రెండవ వాటికన్ మహాసభ పత్రం గౌదియుం ఎత్ స్పెస్ (Gaudium et Spes) గురించి బోధిస్తూ,వివాహం, కుటుంబ జీవితం యొక్క ప్రాముఖ్యతను వివరించారు. భార్యాభర్తల మధ్య బంధం పరస్పర ప్రేమ,నమ్మకం,గౌరవం, జీవితాంతం ఒకరికొకరు తోడుగా నిలిచే నిబద్ధతపై ఆధారపడి ఉండాలని తెలిపారు.క్రీస్తు తన సంఘాన్ని ప్రేమించినట్లుగా భార్యాభర్తలు కూడా ఒకరినొకరు ప్రేమించుకోవాలని సూచించారు.కుటుంబం సమాజానికి పునాది వంటిదని, పిల్లలు ప్రేమను,మానవీయ విలువలను నేర్చుకునే తొలి పాఠశాల అని వివరించారు.పిల్లలను కనడం, వారికి మంచి పెంపకాన్ని అందించడం తల్లిదండ్రుల పవిత్ర బాధ్యత అని గుర్తుచేశారు.మానవ జీవితం గర్భధారణ జరిగిన క్షణం నుంచే గౌరవించబడాలని, ప్రతి మానవ ప్రాణాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. నజరేతు తిరు కుటుంబం ఆదర్శాన్ని అనుసరిస్తూ,నేటి కుటుంబాలు ప్రేమ,ఐక్యత,విశ్వాసంతో జీవించాలని పోప్ ఆకాంక్షించారు.
