శస్త్రచికిత్స అనంతరం తొలిసారిగా ఏంజెలుస్ ప్రార్థనలో పాల్గొన్న పోప్ లియో XIV

జోసెఫ్ అవినాష్

19 Oct 2026

అక్టోబర్ 18, 2026, ఆదివారం రోజున శస్త్రచికిత్స అనంతరం కోలుకుంటున్న పోప్ లియో XIV గారు వాటికన్‌లోని సెయింట్ పీటర్స్ స్క్వేర్‌లో విశ్వాసులతో కలిసి ఏంజెలుస్ ప్రార్థనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వేలాది మంది విశ్వాసులు ఆయనకు స్వాగతం పలికారు. తన కోసం ప్రార్థించిన వారందరికీ పోప్ కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యంగా జెమెల్లి ఆసుపత్రిలో తనకు చికిత్స అందించిన వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బందికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఆదివారం సువిశేషాన్ని వివరిస్తూ, “కైసరువి కైసరునకు, దేవునివి దేవునికి చెల్లించండి” (మత్తయి 22:21) అనే యేసుక్రీస్తు వాక్యాన్ని ప్రస్తావించారు. స్వార్థపూరిత ఆశయాలకు, కపటత్వానికి దూరంగా ఉంటూ దేవుని నీతిని ప్రథమంగా వెదకాలని, నిజాయితీతో జీవించాలని పిలుపునిచ్చారు. అనారోగ్యంతో బాధపడుతున్నవారి పట్ల తన అనుభవం మరింత సాన్నిహిత్యాన్ని కలిగించిందని పేర్కొంటూ, తన సాధారణ కార్యక్రమాలను క్రమంగా తిరిగి ప్రారంభిస్తానని తెలిపారు. ఈ క్రమంలో విశ్వాసుల ప్రార్థనలు తనకు ఎంతో అవసరమని పోప్ అన్నారు.

Subscription

You do not have an active subscription. Subscribe Below


Welcome User

Signup/Login with your Phone Number to continue with Bharathamithram
LOGIN