సిలువ తలపై పడి ఫాదర్ మృతి

జోసెఫ్ అవినాష్
19 Oct 2026
అక్టోబర్ 17న ఈక్వెడార్‌లోని నిత్య సహాయమాత దేవాలయంలో అత్యంత విషాదకరమైన ఘటన చోటుచేసుకుంది.కతోలిక గురువులు ఫాదర్ పాట్రిసియో దివ్యబలిపూజను సమర్పిస్తూ,ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతుండగా,వెనుక వైపు ఉన్న భారీ చెక్క సిలువ స్వరూపం అకస్మాత్తుగా ఆయనపై పడిపోయింది.ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన ఫాదర్ అక్కడికక్కడే మరణించారు.అక్కడున్న సిబ్బంది ఆయనను కాపాడేందుకు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది.ఈ హృదయ విదారక ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతోంది. ఫాదర్ గారి ఆత్మ శాంతికై మనమంతా ప్రార్థిద్దాం.
