పోప్ లియో XIV ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్
జోసెఫ్ అవినాష్
17 Oct 2026
పోప్ లియో XIV ఆరోగ్య పరిస్థితి మెరుగుపడటంతో, రోమ్లోని జెమెల్లి ఆసుపత్రి వైద్యులు ఆయనను ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేసేందుకు అనుమతించారు.కుడి ఊపిరితిత్తికి శస్త్రచికిత్స చేయించుకున్న అనంతరం ఐదవ రోజు ఆయన ఆరోగ్య పరిస్థితిని పరీక్షించిన వైద్యులు, రక్త పరీక్షలు, ఛాతీ ఎక్స్రే ఫలితాలు సంతృప్తికరంగా ఉన్నాయని తెలిపారు. ఈ నేపథ్యంలో అక్టోబర్ 17వ తేదీ శనివారం మధ్యాహ్నం ఆయన వాటికన్కు తిరిగి వెళ్లనున్నారు.
ఆసుపత్రి నుంచి వెళ్లే ముందు,జెమెల్లి ఆసుపత్రి పదవ అంతస్తులో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ప్రార్థనా మందిరంలో పోప్ పవిత్ర దివ్యబలిని సమర్పించనున్నారు. అనంతరం అక్టోబర్ 18వ తేదీ ఆదివారం వాటికన్లోని తన నివాస కిటికీ నుంచి విశ్వాసులతో కలిసి ఏంజెలుస్ ప్రార్థన చేయనున్నారు.
