మరియమాతా ! వందనం!

కొండవీటి అంతయ్య, సత్తెనపల్లి
16 Oct 2026
మరియ మాతా ! వందనం!
****"*******************
మరువకెప్పుడు వర జప మాల పట్టి,
జాగు సేయక భక్తితో జపము చెప్పి,
అండగా నుండుమమ్మ మాకందరికని
తల్లి మరియను వేడెద తలను వంచి!
పూసలున్నట్టి జపమాల వాసి గనుచు
పూస పూసకువెజపములు పూర్తి చేసి
నమ్మితిని నిన్ను వరమీయ వమ్మ యనుచు
తల్లి మరియను వేడెద తలను వంచి!
