కతోలిక పుణ్యక్షేత్రాల్లో గుహలు ఎందుకు నిర్మిస్తారు?

జోసెఫ్ అవినాష్

15 Oct 2026

కతోలిక పుణ్యక్షేత్రాలలో మనకు అందమైన గుహలు అందులో సుందరమైన మరియమాత స్వరూపాలు కనిపిస్తూ ఉంటాయి.మరియతల్లి లూర్ధు నగరంలో బెర్నదత్ అనే యవ్వన బాలికకు మస్సఖిల్లి కొండ గుహలో 1858 ఫిబ్రవరి 11 నుండి జూలై 16 మధ్యలో 18 మార్లు దర్శనమిచ్చి తన ప్రత్యేక సందేశాలను అందించారు.ఈ కొండ గుహ 88 అడుగుల ఎత్తు, 32 అడుగుల వెడల్పుతో అజరామరంగా క్రీస్తుని కోటగా, ప్రార్థనాలయంగా విరాజిల్లుతుంది ఈ కొండగుహ, ప్రతి యాత్రికుడు కొండంత ఆశతో, కోటి కోర్కెలతో చేరి ప్రార్ధించే స్థలంగా కతోలిక చరిత్రలో ఉన్నతమైన స్థానాన్ని సంపాదించుకుంది.ఈ గుహ ఎందరో విశ్వాసులకు, అవిశ్వాసులకు ఎనలేని అనుగ్రహాలను కురిపిస్తూ, క్రీస్తుకు మార్గముగా, క్రీస్తు మధ్య వర్తిత్వంగా, పరలోక భూలోకమునకు మార్గముగా మరియు క్రీస్తు విన్నప కేంద్రముగా నిలిచి ఉన్నది.

ఈ గుహ ద్వారా మరియతల్లి క్రీస్తు భక్తులకు కొండంత అండగా,నీడగా సేద తీరుస్తుంది.అందుకే మన కతోలిక పుణ్యక్షేత్రాలలో గుహలు కనిపిస్తాయి.ఇవి ఆనాడు మరియమాత లూర్ధు నగరంలో ఇచ్చిన దర్శనాలను, సందేశాలను మనకు గుర్తు చేస్తాయి.గుహలో మరియమాత స్వరూపాలు ఆమె వినయాన్ని, తనను నమ్ముకున్న విశ్వాసులకు ఆ తల్లి ఎల్లవేళలా తోడుంటారన్న అభయాన్ని అందిస్తున్నాయి. ఎంతో ప్రశాంతమైన వాతావరణంలో ఈ గుహలు నిర్మిస్తారు. భక్తులు ఈ గుహ చెంత భక్తి, విశ్వాసాలతో ప్రార్థిస్తారు.

బైబిల్ ప్రకారం, యేసుక్రీస్తు బెత్లెహేములోని ఒక పశువుల పాకలో (ఇది ఒక రాతి గుహగా పరిగణించబడుతుంది) జన్మించారు. అలాగే, ఆయనను సిలువ వేసిన తర్వాత సమాధి చేసింది కూడా ఒక రాతి గుహలోనే.ఆయన ఆ గుహ నుంచే తిరిగి లేచారు (పునరుత్థానం). అందువల్ల గుహలు జననానికి, పునర్జన్మకు ప్రతీకలుగా నిలుస్తాయి.బైబిల్ కాలంలో ప్రవక్తలు దేవునితో గడపడానికి,ప్రార్థన చేయడానికి కొండలు,గుహలను ఎంచుకునేవారు.గుహలు నిశ్శబ్దానికి,లోతైన ఆధ్యాత్మిక ధ్యానానికి అనుకూలంగా ఉంటాయి.

Subscription

You do not have an active subscription. Subscribe Below


Welcome User

Signup/Login with your Phone Number to continue with Bharathamithram
LOGIN