మన జీవన విధానాన్ని మార్చుకుందాం

జోసెఫ్ అవినాష్

14 Oct 2026

సామాన్య 28వ గురువారం
సువిశేష ధ్యానం
లూకా 11:47-54
ఈనాటి సువార్తలో యేసుప్రభువు ధర్మశాస్త్ర బోధకుల జీవిత విధానాన్ని పరిశీలించుకోమని తెలియపరిచారు.

1. దర్మశాస్త్ర బోధకులు మతాచారములను దేవుడు చెప్పిన వాని కంటే మరీ కఠినపరచినారు.

2. ప్రవక్తలను గౌరవించినట్లుగా వారు నటించిరి వారి పితరులు. దేవుని వలన పంపబడిన ప్రవక్తలను చంపిరి వారి కుమారులైన వీరు, ఇప్పుడు దేవుని వలన పంపిన ప్రవక్తలను చంపుచున్నారు.

3. మీరును అదే విధముగా చేయుచున్నారు: ప్రభువు, వారి వద్దకు ప్రవక్తలను, అపోస్తులులను పంపిస్తారు. వారు కొందరిని చంపుదురు,కొందరిని హింసింతురు. చివరి ప్రవక్తయైన యోహానును చంపిరి. ప్రభువును సిలువ మరణమునకు అప్పగించిరి. సెఫనును చంపిరి తదుపరి అపోస్తులను చంపిరి.

4. పూర్వము చంపబడిన ప్రవక్తల దృష్టాంతమును వీరి యెదుట పెట్టినారు ఏబేలు మొదలుకొని జెకర్యా వరకును, లోకము పుట్టినది మొదలు కొని ప్రవక్తలను హత్య చేయుట వీరి పితరులకు సామాన్యమైనది. హెబేలు దేవుని కొరకు సాక్షిగా చనిపోయిన పాతనిబంధన ప్రవక్త. ఈ ఇరువురి పాతనిబంధన ప్రవక్తల మధ్యను ఇంకను అనేకమంది హత్య కావింపబడిరి. అందుకనే ఆ రక్తము నిమిత్తము దోషులందరును అంత్య తీర్పు సమయమున విచారింపబడుదురు.

5. ప్రభువు, ధర్మశాస్త్ర బోధకులకు జ్ఞానము తెలియపరిచారు. వారి తమ జీవితములను మార్చు కోవాలని సలహ ఇచ్చారు.

Subscription

You do not have an active subscription. Subscribe Below


Welcome User

Signup/Login with your Phone Number to continue with Bharathamithram
LOGIN