అబార్షన్ నుంచి రక్షించబడిన 15 మంది చిన్నారులకు జ్ఞానస్నానం ఇచ్చిన స్పెయిన్ పీఠాధిపతి

జోసెఫ్ అవినాష్
14 Oct 2026
స్పెయిన్లోని గెటాఫే పీఠాధిపతి జినెస్ గార్సియా బెల్ట్రాన్ గారు, మాడ్రిడ్ సమీపంలోని బోవాదిల్లా డెల్ మోంటేలో ఉన్న పవిత్ర దివ్య కారుణ్య దేవాలయంలో 15 మంది చిన్నారులకు జ్ఞానస్నానం ఇచ్చారు.గర్భస్రావం చేయించుకోవాలని ఆలోచించిన తల్లులకు మాస్ ఫుతురో , జాన్ పాల్ II రెస్క్యూవర్స్ స్వచ్ఛంద కార్యకర్తలు సకాలంలో సహాయం అందించడంతో ఆ తల్లులు తమ గర్భధారణను కొనసాగించి పిల్లలకు జన్మనిచ్చారు.ఈ కార్యక్రమం సందర్భంగా, తమ సేవ ద్వారా ఇప్పటివరకు దాదాపు 9,000 మంది చిన్నారుల ప్రాణాలను కాపాడగలిగామని మాస్ ఫుతురో అధ్యక్షురాలు మార్తా వెలార్డే తెలిపారు. బాప్తిస్మంతో తమ సేవ ముగియదని, గర్భస్రావం అనంతరం మానసికంగా, భావోద్వేగపరంగా బాధపడుతున్న తల్లులకు కూడా తమ సంస్థ అండగా నిలుస్తుందని ఆమె పేర్కొన్నారు. గెటాఫే పీఠంలో గత పదేళ్లకు పైగా ఇటువంటి చిన్నారులకు బాప్తిస్మం ఇస్తూ వస్తున్నారు. గత సంవత్సరం కూడా 17 మంది చిన్నారులకు జ్ఞానస్నానం ఇచ్చారు.
