పశ్చిమ బెంగాల్లో బైబిల్ సమావేశంపై దాడి: భారత కతోలిక పీఠాధిపతుల ఖండన
.jpg)
జోసెఫ్ అవినాష్
14 Oct 2026
పశ్చిమ బెంగాల్లోని నదియా జిల్లాలో క్రైస్తవుల బైబిల్ సమావేశంపై జరిగిన దాడిని భారత కతోలిక పీఠాధిపతుల సమాఖ్య (CBCI) తీవ్రంగా ఖండించింది. అక్టోబర్ 8 నుంచి 11 వరకు క్రిష్ణనగర్ పీఠం పరిధిలోని జలాల్ఖాలిలో ఉన్న దివ్య ప్రేమ ప్రార్థనా కేంద్రంలో సంతాలి బైబిల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి అవసరమైన అనుమతులు తీసుకున్నప్పటికీ, అక్టోబర్ 9న బలవంతపు మతమార్పిడులు జరుగుతున్నాయనే ఆరోపణలతో కొందరు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకుని చర్చి ఆస్తులను ధ్వంసం చేసి, అక్కడి వారిపై దాడి చేసినట్లు CBCI తెలిపింది. ఈ ఘటనలో గురువులు, కన్యా స్త్రీలు ,ప్రార్థనలో పాల్గొన్నవారు భయాందోళనలకు గురయ్యారు. మతస్వేచ్ఛ ప్రతి పౌరుడి ప్రాథమిక హక్కు అని పేర్కొన్న పీఠాధిపతులు, దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాన్ని కోరారు. అలాగే, మతపరమైన మైనారిటీలకు రక్షణ కల్పించేందుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
