పోప్ శస్త్రచికిత్స విజయవంతం కావాలని ప్రపంచవ్యాప్తంగా కతోలికుల జపమాల ప్రార్థనలు

జోసెఫ్ అవినాష్

13 Oct 2026

విశ్వ కాపరి పోప్ లియో XIV ఊపిరితిత్తిలోని చిన్న, పరిమిత ప్రాంతంలో ఉన్న కణితిని తొలగించేందుకు శస్త్రచికిత్స చేయించుకోనున్న నేపథ్యంలో,ఆయన ఆరోగ్యం మరియు త్వరగా కోలుకోవాలని ప్రపంచవ్యాప్తంగా కతోలికులు ప్రార్థనల్లో పాల్గొన్నారు.రోమ్ పీఠాధిపతి వికార్ జనరల్ కార్డినల్ బాల్దస్సారే రైనా, రోమ్‌లోని జెమెల్లి ఆసుపత్రిలో ఉన్న పునీత 2వ జాన్ పాల్ ప్రార్థనా మందిరంలో అక్టోబర్ 13న సాయంత్రం 6 గంటలకు జపమాల ప్రార్థనకు నాయకత్వం వహించనున్నారు.అదే సమయంలో రోమ్‌లోని ప్రతి విచారణ సంఘం, విచారణ కూడా జపమాల ప్రార్థనలు చేయాలని ఆయన పిలుపునిచ్చారు.పెరూ, ఫిలిప్పీన్స్, ఆఫ్రికా, అమెరికాలోని చికాగో తదితర ప్రాంతాల్లోనూ పోప్ ఆరోగ్యం కోసం దివ్యబలిపూజలు,ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. పోప్‌కు చికిత్స అందిస్తున్న వైద్యుల కోసం కూడా ప్రార్థించాలని,కుటుంబాలు మరియు మతసంఘాలు జపమాలతో పాటు దానధర్మాలు, త్యాగ కార్యాలను సమర్పించాలని పిలుపునిచ్చారు.

Subscription

You do not have an active subscription. Subscribe Below


Welcome User

Signup/Login with your Phone Number to continue with Bharathamithram
LOGIN