పలుకరింత!

కొండవీటి అంతయ్య, సత్తెనపల్లి

12 Oct 2026

పలుకరింత!
*******
జీవులన్నింటిలో మాట్లాడే సామర్ధ్యం ఒక్క మనిషికే సొంతం.మెదడు నియంత్రణలో స్వరపేటికలో పుట్టే శబ్దం, మన నోరు,నాలుక,పెదవుల ద్వారా మాటల రూపునందుకొని బయటకు వస్తుంది. అలా వచ్చే మాటలు కొన్నిసార్లు మధురంగా మార్దవాలొలికించ వచ్చు.మరి కొన్నిసార్లు తూటాల్లా పేల వచ్చు. ఏదైనా సందర్భానుసారంగా భావావేశాల కనుగుణంగా ఉండే పలుకులే శ్రోతలకు మనో రంజకంగా వీనుల విందుగా ఉంటాయి మరి! సృష్ఠిలో మాట్లాడే వరమనుగ్రహింప బడిన మనుషులం,ఆవరాన్నిసద్వినియోగపరచుకున్నప్పుడు మనీషుల మవుతాం!

(సామెతలు 13:3-
తన నోరు కాచుకొనువాడు తన్ను కాపాడుకొనును ఊరకొనక మాటలాడువాడు తనకు నాశనము తెచ్చుకొనును.)

ఆ.వె:
పెదవి విప్పు నప్పు డదుపును కలిగియు
పదము పలుకు వాని బ్రతుకు హాయి!
నోరు తెరిచి బూతు లూరక పలికిన
వారి బ్రతుకులందు బాధ నిండు!
ఆ.వె:
పలుకరింపనేల పలుగాకులట్లుగా
ప్రల్లదమ్ము లాడు వాయి యేల?
పంచదార వోలె పలుకులుండి యెపుడు
మంచి పెంచి ప్రేమ పంచవలయు!

Subscription

You do not have an active subscription. Subscribe Below


Welcome User

Signup/Login with your Phone Number to continue with Bharathamithram
LOGIN