పశ్చిమ బెంగాల్‌లో కతోలిక ధ్యానకేంద్రంపై దాడి

జోసెఫ్ అవినాష్
12 Oct 2026
అక్టోబర్ 11న పశ్చిమ బెంగాల్‌లోని నదియా జిల్లాలో, జలాల్‌ఖాలి ప్రాంతంలోని డివైన్ లవ్ ధ్యానకేంద్రంపై బైబిలు సమావేశం జరుగుతున్న సమయంలో కొందరు వ్యక్తులు దాడి చేశారు.ఈ ఘటనలో ఆరుగురు గాయపడగా,వారిలో ఇద్దరి పరిస్థితి తీవ్రంగా ఉన్నట్లు తెలియవచ్చింది.గిరిజనులను బలవంతంగా క్రైస్తవ మతంలోకి మారుస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో ఈ దాడి జరిగినట్లు సమాచారం.అయితే,చర్చి అధికారులు ఈ ఆరోపణలను ఖండించారు. కృష్ణనగర్ పీఠాధిపతి బిషప్ డా. నిర్మల్ విన్సెంట్ గోమ్స్ పోలీసులకు ఫిర్యాదు చేసి, క్రైస్తవులకు రక్షణ కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు.
