ఊపిరితిత్తుల్లో చిన్న గడ్డ తొలగింపు కోసం శస్త్రచికిత్స చేయించుకోనున్న పోప్

జోసెఫ్ అవినాష్
12 Oct 2026
విశ్వ కాపరి, పోప్ లియో XIVకు శస్త్రచికిత్స చేయనున్నారు. వైద్య పరీక్షల్లో ఆయన ఊపిరితిత్తుల్లో చిన్న గడ్డ ఉన్నట్లు గుర్తించడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. రాబోయే కొద్ది రోజుల్లోనే ఆపరేషన్ చేయనున్నట్లు పోప్ స్వయంగా వెల్లడించారు.అయితే,గడ్డను తొలిదశలోనే గుర్తించామని, అది నిర్దిష్ట ప్రాంతానికే పరిమితమై ఉందని ఆయన తెలిపారు. వైద్యులు శస్త్రచికిత్స చేయడం సముచితమని భావించడంతో తాను అంగీకరించినట్లు వివరించారు.రోమ్‌లోని సెయింట్ పీటర్స్ స్క్వేర్‌లో ఆదివారం నిర్వహించిన వారపు ప్రార్థన సందర్భంగా పోప్ ఈ విషయాన్ని భక్తులతో పంచుకున్నారు. ఊపిరితిత్తుల్లో గుర్తించిన గడ్డపై వైద్యులు పరీక్షలు నిర్వహించారని,ముందస్తుగానే గుర్తించడం వల్ల అవసరమైన చికిత్సకు సిద్ధమవుతున్నట్లు చెప్పారు. తన ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతున్న విశ్వాసులకు భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు.
