అక్టోబర్ 12 - పునీత కార్లో అకుటిస్ స్మరణ

జోసెఫ్ అవినాష్

11 Oct 2026

జననం, బాల్యం, కుటుంబ నేపథ్యం:
పునీత కార్లో అకుటిస్ ఇటలీ దేశమున కతోలిక కుటుంబంలో జన్మించారు.వీరు లండన్ నగరంలో 1991 మే మాసం 3వ తేదీన ధనిక కుటుంబంలో జన్మించారు. తల్లి ఆండ్రియా అకుటిస్,తండ్రి అంటోనియా సల్ జానో మొదట వీరి కుటుంబం లండన్ మరియు జర్మనీలో జీవించేది. కార్లో జననం తరువాత ఇటలీ నగరమైన మిలన్ లో స్థిర నివాసం ఏర్పరచుకున్నారు. కార్లో తన ఏడవ ఏట మొదటి "దివ్యసత్ర్పసాదమును" స్వీకరించారు.తను ప్రతిసారి "దివ్యసత్ర్పసాద" స్వీకరణ అనంతరం లేదా "దివ్యసత్ర్పసాదమునకు" ముందు దివ్య మందసం ముందు మోకరించి ధ్యానించేవారు. వారానికి ఒకసారి పాప సంకీర్తన చేసేవారు మిలాన్ లో జేసుసభ గురువుల పాఠశాలలో విద్యాభ్యాసం చేశారు చిన్ననాటి నుండే తనకు కంప్యూటర్ పట్ల మక్కువ ఎక్కువ వానిని ఉపయోగించుకుంటూ దేవుని అనుభవము నందు మరియు తన విద్యాభ్యాసం నందు పురోగతిని పొందేవారు.

ఈ పునీతులే ఆయన మార్గదర్శకులు:
కార్లో తన ఆధ్యాత్మిక జీవితంలో పునీతులను జీవిత మార్గదర్శకులుగా ఎన్నుకొన్నారు అందులో పునీత అస్సిసిపుర ఫ్రాన్సిస్ గారు, పునీత డొమినిక్ సావియో,పునీత బెర్నదత్తు గారు ప్రముఖులు.

కారుణ్యమే ఆయన జీవన విధానం:
విడిపోయిన లేక విడాకులు తీసుకున్న తల్లిదండ్రుల బిడ్డలు కార్లో గారికి స్నేహితులుగా ఉండేవారు. విడిపోయిన తల్లిదండ్రులు గల స్నేహితుల గూర్చి ఎక్కువగా బాధపడేవారు. తల్లిదండ్రులు భిన్న స్వరాలు అభిప్రాయాలతో ఉన్నప్పుడు స్నేహితులను తన ఇంటికి ఆహ్వానించేవారు వారికి తన ఇంట్లోనే ఆశ్రయం కల్పించేవారు..

ప్రత్యేకంగా దివ్యాంగులు వారి హక్కులను గూర్చి ఎక్కువగా పోరాడేవారు. ఎవరైనా అలాంటి వారిని హేళన చేసినప్పుడు భరించలేక వారి తరఫున వాదించి వారిని దగ్గరకు చేర్చుకునేవారు. తనకు యాత్రలు చేయటం అంటే చాలా ఇష్టం అయితే అన్ని ప్రదేశాలలో అస్సిసిపురమంటే అమితమైన ఇష్టం.

శ్రమలను ముద్దాడాడు:
కార్లో తన యవ్వనమున రక్త క్యాన్సర్ వ్యాధికి గురయ్యారు. తరువాత ఆ వ్యాధిని తీవ్రతను నొప్పిని అంతటిని దేవునికి సమర్పణ చేస్తూ ఆ బాధలను నొప్పులను 16వ బెనెడిక్ట్ జగద్గురువుల కొరకు విశ్వ శ్రీసభ కొరకు సమర్పించారు.

" నా రోగ భారమును నేను భరిస్తాను ఇంకా నాకు రావాల్సిన బాధనంతా కూడా నా దేవునికి జగద్గురువులకు నా విశ్వ శ్రీ సభకు సమర్పిస్తూ ప్రార్థిస్తున్నాను అన్నారు అప్పటినుండి తన తల్లిదండ్రులను "దివ్యసత్ర్పసాదము ద్వారా అద్భుతాలు జరిగిన ప్రదేశాలను దేవాలయాలను చూపించమనేవాడు‌ ఆ విధంగా కార్లో ప్రపంచంలోని చాలా ప్రదేశాలకు తీర్థయాత్రగా వెళ్లారు కానీ కొన్ని రోజులకు వ్యాధి మొదట ఉంటే అది కూడా వీలు కాలేదు

సాంకేతికతను ప్రభువు కొరకు ఉపయోగించేవాడు:
చిన్ననాటి నుండి కార్లోకు అంతర్జాలం, కంప్యూటర్ పట్ల ఎక్కువ శ్రద్ధ ఉండటం ద్వారా కార్లో 2005లో ఒక వెబ్ సైట్ ను ఏర్పాటు చేసి అందులో దివ్యసత్ర్పసాద అద్భుతాలు, స్వస్థతలు ,మహిమ ప్రదేశాలు పొందుపరిచేవారు .అంతేకాక వెబ్సైట్ ద్వారా మీడియా ద్వారా సువార్త పరిచర్య ఆరంభించి మీడియా ద్వారా నవీన పద్ధతుల్లో సువార్త బీజాలను వెదజల్లడంలో విజేయుడయ్యాడు కార్లో అకుటిస్.

దివ్యసత్ర్పసాదం- పరలోక రహదారి:
ఒకసారి వెబ్సైట్లో దివ్యసత్ర్పసాదమును ఎంతగా స్వీకరిస్తే అంతగా క్రీస్తు వలే రూపాంతరం చెందుతామని ఆ విధంగా పరలోక సిరులను మోక్ష భాగ్యమాధుర్యమును మనము ఈ లోకంలోనే ముందుగానే రుచి చూడగలమని సెలవిచ్చారు. దివ్యసత్ర్పసాదమే పరలోక మార్గమని వివరించారు.ఈరోజు విశ్వ శ్రీసభచే దివ్యసత్ర్పసాద ధన్యజీవి అని వేనోళ్ళ పొగడబడుతున్నారు..

ఒకసారి తనకు చికిత్స చేస్తున్న డాక్టర్ రక్త క్యాన్సర్ వల్ల అధిక నొప్పిగా ఉన్నదా అని అడగగా "నాకంటే ఎక్కువగా బాధపడేవారు చాలామంది ఉన్నారు" అని జవాబు ఇచ్చారు. ఆ విధంగా వ్యాధితో బాధపడుతూ 2006లో అక్టోబర్ మాసం 12వ తేదీన ఉదయం 6:45 నిమిషాలకు పరమాత్ముని పరలోకంలో కలుసుకున్నారు. తన కోరుకున్న విధంగా తన ఇష్టమైన అస్సిసి నగరంలో భూస్థాపితం చేశారు..

విశిష్ట జీవితానికి గాను విలువైన బహుమానం-:
తన మరణం తరువాత ఆయనకు ధన్యతను అనుగ్రహించాలనే కోరిక చాలా బలపడగా పునీతపట్టమునకు మొదటి అంతస్తుకై దైవ సేవక పట్టమును 2013లో అనుగ్రహించారు. 2013లో లాంబోటి పీఠాధిపతుల సమైక్య వీరిని పునీతాంతస్తుకు కావాల్సిన అర్హత కై వెతకటం ఆరంభించమని కోరింది. 2013 ఫిబ్రవరి 15 నుండి కార్డినల్ ఎంజలో స్కోలా అధ్యక్షతన మేత్రాసన స్థాయిలో మొదలైన ప్రక్రియ 2016 నవంబర్ 24 వరకు కొనసాగింది. 2013 మే మాసం 13న దైవ సేవకుడిగా శ్రీ సభచే పరిగణించబడ్డారు. 2018 జూలై 5న నాటి జగద్గురువులు స్వర్గీయ. పోప్ ఫ్రాన్సిస్ గారిచే సుగుణాల వీరుడని, మహనీయుడని గుర్తించబడ్డారు..

చెక్కుచెదరని ఆయన పవిత్ర దేహం-:
కార్లో 2006లో అక్టోబర్ 12న తీవ్రమైన రక్త క్యాన్సర్ వ్యాధితో మరణించారు. కార్లోని ధన్యజీవిగా ప్రకటించు సాంగ్యములు అతడు అమితంగా దర్శించిన ఇష్టపడిన అస్సిసి నగరమునందు నిశ్చయించాలని పెద్దలు నిర్ణయించారు. 2019 ఏప్రిల్ 6న కార్లో మృతదేహమును అస్సిసి లోని మేరీ మేజర్ దేవాలయంలోనికి తరలించు సమయమున అతని మృతదేహం చెక్కుచెదరక కుళ్ళిపోకుండటం కనుగొన్నారు.

" నా జీవితం అంతా ఒక్క నిమిషం కూడా వృధా చేయలేదు. దేవునికి అయిష్టమైన వాటిని ఎప్పుడు చేయలేదు. నేను ప్రశాంతముగా మరణిస్తాను అని కార్లో అకుటీస్ పలికారు". సెప్టెంబర్ 7న జగద్గురువులు పోప్ లియో XIV కార్లో అకుటిస్ గారిని పునీతులుగా ప్రకటించారు. యువతి, యువకుల అంతర్జాల పాలక పునీతుడిగా , మూడవ సహస్రబ్ది యువ దిక్సూచిగా కతోలిక శ్రీసభ కార్లో గారిని గౌరవిస్తుంది.

Subscription

You do not have an active subscription. Subscribe Below


Welcome User

Signup/Login with your Phone Number to continue with Bharathamithram
LOGIN