మరణశిక్ష మానవ గౌరవానికి విరుద్ధం: పోప్

జోసెఫ్ అవినాష్

10 Oct 2026

మరణశిక్ష మానవ వ్యక్తి గౌరవానికి,అతని ప్రాణ పవిత్రతకు విరుద్ధమని పోప్ లియో XIV పునరుద్ఘాటించారు.ప్రపంచ మరణశిక్ష వ్యతిరేక దినోత్సవం సందర్భంగా శనివారం తన అధికారిక ఎక్స్ ఖాతాలో ఈ సందేశాన్ని ప్రచురించారు.న్యాయాన్ని కాపాడటానికి, సమాజ శ్రేయస్సును పరిరక్షించడానికి మరణశిక్ష విధించాల్సిన అవసరం లేదని పోప్ స్పష్టం చేశారు.నేరస్థులను సమాజానికి హాని కలిగించకుండా సమర్థవంతమైన నిర్బంధ వ్యవస్థల ద్వారా అదుపులో ఉంచవచ్చని,అదే సమయంలో వారు తమ తప్పులను గుర్తించి పశ్చాత్తాపపడటానికి,పరివర్తన చెందటానికి అవకాశాన్ని పూర్తిగా తొలగించకూడదని పేర్కొన్నారు.తీవ్రమైన నేరాలకు పాల్పడినప్పటికీ,ఒక వ్యక్తి మానవ గౌరవాన్ని కోల్పోడని కతోలిక శ్రీసభ బోధిస్తుందని పోప్ గుర్తుచేశారు.ప్రతి వ్యక్తిలో పరివర్తన చెందే అవకాశం ఉందని,న్యాయం పేరుతో ఒకరి ప్రాణాన్ని తీసివేయడం సముచితం కాదని ఆయన సందేశం స్పష్టం చేస్తోంది. మానవ ప్రాణ పవిత్రతను,ప్రతి వ్యక్తి గౌరవాన్ని కాపాడుతూ ప్రపంచవ్యాప్తంగా మరణశిక్షను రద్దు చేయడానికి కృషి చేయాలని కతోలిక శ్రీసభ పిలుపునిస్తోంది.

Subscription

You do not have an active subscription. Subscribe Below


Welcome User

Signup/Login with your Phone Number to continue with Bharathamithram
LOGIN