శాంతి కోసం చిన్నారులతో కలిసి జపమాల ప్రార్థించిన పోప్
జోసెఫ్ అవినాష్
02 Oct 2026
అక్టోబర్ 1న జపమాల మాసం ప్రారంభమైన సందర్భంగా పోప్ లియో XIV వాటికన్ గార్డెన్స్‌లోని లూర్దు మాత గుహ వద్ద చిన్నారులతో కలిసి ప్రపంచ శాంతి కోసం జపమాల ప్రార్థించారు.ఈ ప్రార్థనలో సుమారు 1,300 మంది పాల్గొనగా, వారిలో దాదాపు 700 మంది చిన్నారులు ఉన్నారు.ప్రపంచవ్యాప్తంగా దాదాపు 10 లక్షల మంది పిల్లలు పాల్గొంటున్న “One Million Children Praying the Rosary” కార్యక్రమానికి ఇది శ్రీకారం చుట్టింది.యుద్ధాలు, హింసతో బాధపడుతున్న ప్రాంతాల్లోని పిల్లలు,కుటుంబాల కోసం ప్రత్యేకంగా ప్రార్థనలు చేశారు.జపమాల ద్వారా మరియతల్లితో కలిసి ప్రపంచంలోని బాధలను యేసు సన్నిధికి తీసుకెళ్లాలని పోప్ పిలుపునిచ్చారు.జపమాల ప్రార్థనతో పాటు ప్రేమ,దయ,మంచి పనులను కూడా ఆచరించినప్పుడే సమాజంలో నిజమైన శాంతి పెరుగుతుందని ఆయన చెప్పారు.ఈ ప్రార్థనా కార్యక్రమం అక్టోబర్ 1 నుంచి 7 వరకు కొనసాగి,అక్టోబర్ 7న జరుపుకునే జపమాల మాత మహోత్సవంతో ముగుస్తుంది.
