అక్టోబర్ నెల ప్రార్థనా ఉద్దేశాన్ని ప్రకటించిన పోప్

జోసెఫ్ అవినాష్

02 Oct 2026

అక్టోబర్ నెలలో మానసిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారి కోసం ప్రార్థించాలని పోప్ లియో XIV పిలుపునిచ్చారు.మానసిక అనారోగ్యంతో బాధపడుతున్న అనేకమంది ఒంటరితనం,బాధ,నిరాశను అనుభవిస్తున్నారని,వారి పరిస్థితిని అర్థం చేసుకుని వారిని ప్రేమతో,గౌరవంతో ఆదరించాల్సిన అవసరం ఉందని ఆయన గుర్తుచేశారు.మానసిక ఆరోగ్య సమస్యలను బలహీనతగా చూడకుండా, బాధపడుతున్నవారిని తీర్పు చెప్పకుండా వారి మాటలను వినాలని,వారిని సమాజం నుంచి దూరం చేయకుండా అండగా నిలవాలని పిలుపునిచ్చారు.ముఖ్యంగా కుటుంబ సభ్యులు,వైద్యులు, ఆరోగ్య కార్యకర్తలు,సేవా సంస్థలు మరియు ఇతరులతో కలిసి కతోలిక సంఘం మానసికంగా బాధపడుతున్న వారికి ఆశ, ఆదరణ,తోడ్పాటు అందించే తెరిచిన ఇల్లుగా ఉండాలని పోప్ కోరారు.

Subscription

You do not have an active subscription. Subscribe Below


Welcome User

Signup/Login with your Phone Number to continue with Bharathamithram
LOGIN