అక్టోబర్ 2 - పరిశుద్ధ కావలి సన్మనస్కుల స్మరణ

కొండవీటి అంతయ్య, సత్తెనపల్లి

01 Oct 2026

కావలి సన్మనస్కులు!
*****************
చిన్నప్పుడు ఎప్పుడైనా భయపడుతూ ఉంటే మా అమ్మ, "మనసమంతా దేవుని బిడ్డలంరా అబ్బాయ్! మనల్ని కాచుకోడానికి, జాగ్రత్తగా చూచు కోడానికి, భయంలేకుండా బ్రతకడానికి, ఆయన కావాలియైన సన్మనస్కులను నియమిస్తారు. ఆ కావలి సన్మనస్కులు ఎప్పుడూ మనల్ని అంటి పెట్టు కొని ఉండి మనల్ని రక్షిస్తూ ఉంటారు తెలుసా?"అంటూ వీపు తడుతూ సముదాయస్తూ ఉండేది.

అసలు ఎవరీ కావలి సన్మనస్కులు అంటూ ఆలోచిస్తే, వాళ్ళు దైవ దూతలే నన్న సంగతి విదితమవుతుంది . ఇజ్రాయేలీయులను రక్షించడానికి , వాళ్ళని సరైన మార్గంలో నడిపించడానికి 'మిఖాయేల్ ' అనే దైవ దూత కావలి సన్మనస్కునిగా ఉండే వాడనీ ,అదే విధంగా ఇజ్రాయేలీయులను వాగ్దత్త భూమికి నడిపించడానికి మోషే కు అండగా దైవ దూత వెంట నిలిచే వాడని పూర్వ వేదం చెబుతున్నది . అంతే కాక ఏసు ప్రభువు పసి బిడ్డల గురించి మాట్లాడుతూ ' వీరి దేవ దూతలు ఎప్పుడూ నా తండ్రి సముఖమున నిలిచియుంటారు ' (మత్తయి 18:10) అని అన్నారని నూతన వేదం చెబుతోంది.

మరి, కావలి సన్మనస్కులు మనకు కనిపించరేం అని అనిపించవచ్చు . నిజానికి , పిల్లల్ని కాచి కాపాడే తల్లి దండ్రులు కంటికి కనిపించే కావలి సన్మనస్కుల రూపాలే గదా ? పిల్లలుగా ఉన్నప్పుడు మనం ఏదైనా తప్పు పని చెయ్యబోతుంటే " ఒరేయ్ ఆ పని చేశావంటే ,నీ గురించి పంతులుగారికి చెబుతా ! మీ అమ్మా నాన్నలకు చెబుతా " అంటూ బెదిరించి ఆ తప్పు చేయకుండా ఆపే తోడి పిల్లలు ,అదే విధంగా మన తప్పులను సరి చేస్తూ , సరియైన మార్గంలో నడిపిస్తూ విద్యను నేర్పే ఉపాధ్యాయులు , మన కోసం దేవాలయంలో దివ్య బలి పూజలు అర్పించే గురువులు , రోగ బాధలకు చికిత్సలు చేసే డాక్టర్లు ,వైద్య సిబ్బంది మొదలైన వాళ్ళందరూ మనకు కావలి సన్మనస్కులే కదా !

Subscription

You do not have an active subscription. Subscribe Below


Welcome User

Signup/Login with your Phone Number to continue with Bharathamithram
LOGIN