ప్రపంచం శబ్దంతో నిండిన వేళ… దేవుని స్వరం వినిపించేది మౌనంలోనే - పోప్
జోసెఫ్ అవినాష్
01 Oct 2026
సెప్టెంబర్ 30న వాటికన్‌లో డొమినికన్ ధ్యాన కన్యా స్త్రీల అంతర్జాతీయ కమిషన్ సభ్యులను పోప్ లియో XIV కలుసుకున్నారు.ఈ సందర్భంగా ఆయన ధ్యాన జీవితం, ప్రార్థన,మౌనం యొక్క ప్రాముఖ్యతను వివరించారు.డొమినికన్ కన్యా స్త్రీలు ధ్యాన జీవితం సంఘానికి దూరంగా ఉండేది కాదని,అది సంఘానికి ఆధ్యాత్మికంగా బలాన్నిచ్చే “కొట్టుకునే హృదయం” వంటిదని అన్నారు.నేటి ప్రపంచం వేగంగా పరుగులు తీస్తూ,ప్రతిదానికీ వెంటనే స్పందించాల్సిన పరిస్థితుల్లో ఉన్నందున మౌనం ఎంతో అవసరమని పోప్ పేర్కొన్నారు.మౌనం అంటే కేవలం మాట్లాడకుండా ఉండటం కాదని,దేవుని వాక్యాన్ని ఆలకించడానికి,ఇతరులను శ్రద్ధగా వినడానికి,సత్యాన్ని గ్రహించడానికి మన హృదయంలో స్థలాన్ని కల్పించుకోవడమని వివరించారు.ప్రార్థన,పరస్పర వినికిడి, క్షమాపణ,సయోధ్య ద్వారా ప్రభువుతో మరింత లోతైన సంబంధాన్ని పెంపొందించుకోవాలని ఆయన కన్యా స్త్రీలను ప్రోత్సహించారు.
