నేటి పునీతులు: పునీత చిన్న తెరేసమ్మ

క్రీస్తు జ్యోతులు మన పునీతులు

30 Sep 2026

మన పునీతులు
అక్టోబర్ 1 2022
పునీత చిన్న తెరేసమ్మ
ST. THERESE OF CHILD JESUS
(ఫ్రెంచ్ కార్మెల్‌సభ కన్యస్త్రీ, లిసీయు తెరేస-చిన్ని పుష్పం - బాలయేసుని చిన్న తేలేసి అని నామాంతరములు. విమానం (చోదకులు నడుపువారు, పూల వ్యాపారులు, విదేశీ సువార్తీకులు, మరియు ఫ్రాన్సుదేశ పాలక పునీతురాలు క్రీ||శ|| 1873 - 1897) పునీత చిన్న తెరేసమ్మగారు ఫ్రాన్సుదేశంలోని అలెన్ సోన్ పట్టణంలో క్రీ||శ|| 1873 జనవరి 2వ తేదీన పుట్టారు. తండ్రి పేరు లూయిస్. మార్టిన్ తలిపేరు జెలీగుయేరిన్. వారు ఒక గురువు, ఒక కన్యస్త్రీ అయి ఉండాల్సినవారు. కాని తామొకటి తలస్తే దైవం ఒకటి తలంచునట్లుగా వారు దంపతులయ్యారు. తమకు కలిగిన సంతానాన్ని దైవ సేవకే అంకితం చేస్తామని వాగ్దానం చేసుకున్నారు. దేవుని దయవల్ల వారికి 9 మంది సంతానం కలిగారు. వారిలో ఇరువురు ఆడపిల్లలు ఇరువురు మగపిల్లలు వారు పుట్టిన కొన్ని మాసాలకే మరణించారు. అయితే వారి కడగొట్టు సంతానమే మరియ ఫ్రాంకోయిన్ తెరేస. ఈ తెరేసగారి కంటే పెద్దవారైన సంతానం అందరి పేర్లకు ముందు మరియ పేరు తప్పక ఉండేది. ఆ తల్లి పై వారికున్న భక్తి ప్రపత్తులు అంత గొప్పవి. అయితే లూయిస్ మార్టిన్ వల వ్యాపారి కాగా ఆయన భార్య లేసులు అల్లికలో దిట్ట. ఆ ఇద్దరు సంపాదనతోనే వారు ధనవంతులయ్యారు కూడా.

అయితే తెరేసగారితో సహ జీవితులైన వారు 5గురూ ఆడపిల్లలే. అందులో ముగ్గురు కార్మెలు మఠంలో కన్యస్త్రీలుగా దేవుని సేవ చేస్తుండగా మరో ఆమె 'విజిటేషన్' సభలో మఠకన్యగా ఉన్నారు. చివరి సంతానమైన చిన్న తెరేసమ్మగార్ని వారి మూడవ ఏటనే దేవునికి అర్పించుకున్నారు. ఆ పిమ్మట కొన్ని మాసాలకే వారితల్లి జెలీగ్వెరిన్ దీర్ఘ జబ్బువల్ల 1877లో మరణించింది. భార్య మరణానంతరం లూయిస్ మార్టిన్ ఆలోచించి మంచి వాణిజ్య కేంద్రమైన లిసీయుక్స్ నగరంలో 'లెసుయిస్సోన్నెట్స్' పేరుగల అందమైన భవనాన్ని కొని తన నివాసాన్ని వ్యాపారాన్ని అందులోకి మార్చాడు. తన 5గురు ఆడపిల్లలు తనతోనే ఉన్నారు.అటి పరిస్థితుల్లో చిన్న తెరేస తన అక్కల పెంపకంలోనే పెరిగారు. అప్పటికి పెద్దక్క మరియకు కేవలం 13 సం||ల ప్రాయం. ఇంటి పనులు చూసుకునేది. • ఆమె పోలీస్ చెల్లెళ్లయిన లియోని, సెలీన్ మరియు తెరేసలకు ఆలన తను చూస్తూ సత్యోపదేశం నేర్పించేది. ఈమెనే తెరేస తల్లిలా భావించారు. తన

అడుగుజాడల్లో నడుస్తున్న తెరేసమ్మగారు తన 8వ ఏట పునీత బెనడికు అల పాఠశాలలో ప్రవేశించి చదువుకున్నారు. ఇంతలో తనను అమలా చూసుకునే అక్క మరియ పౌలీన కన్యస్త్రీ కావడానికి కార్మెల్ మఠంలో చేరింది. దిగులుతో జబ్బు పడి తెరేసగారు మంచం పట్టారు. ఎన్ని మందులు వాడినా నయంకాలేదు. అయితే ఒక రోజు తన గదిలో ఉన్న దేవమాత స్వరూపం చూసి తదేకంగా ప్రార్థించింది. అంతే అద్భుతంగా స్వస్థత చేకూరింది మరియు వారికి తన 10వ ఏట 1884 మే 8వ తేదీన కొత్త దివ్య సత్రసాదం ఇవ్వబడింది. తన దేహం దేవుని ఆలయంగా భావించి శుచి శుద్ధి పాటించారు. 2

తెరేసగారు ఇంట్లో కడపటి బిడ్డ అవడంచే చిన్న తెరేస అంటారు. వీరి అక్క ఒకామె పేరుకూడా మరియ లియోని తెరేస కావడంవల్లకూడ గుర్తుకోసం చిన్నామెను చిన్న తెరేస అనేవారు. బొద్దుగా ముద్దుగా ఉండే ఈ పాపను చిన్న పుష్పం, చిన్న రాణి అనికూడ పిల్చేవారు. వీరు దీనత్వం, నిరాడంబరత అనే చిన్న మార్గం ఎంచుకున్నందున కూడ చిన్న తెరేస అనేవారు.చిన్న తెరేసగారి ముగ్గురు అక్కలు కార్మెలుసభలో కన్యస్త్రీలవ్వగా ఒక అక్క విజిటేషన్ సభలో మఠకన్య అయ్యింది.

తానుకూడ కార్మెలు మఠంలో చేరతానని చిన్న తెరేస పెద్దలను కోరింది. వారికి అప్పుడు 15 ఏండ్లు ప్రవేశించాయి. కనీసం 16 సంవత్సరాలైనా ఉంటేనే అనుమతిస్తారు. ఈ కారణంవల్ల వారికి అనుమతి లభించలేదు. తాను పెద్ద దానిలా కనబడాలని పెద్ద తలకొప్పు వేసుకొని పెద్ద సైజు దుస్తులు ధరించేది. అయినా అనుమతి దొరకలేదు. అయితే 13వ లియో (సింహరాయలు) పోపుగారు తమ గురుత్వ స్వర్ణ జూబిలీ సందర్భంగా రోములో 1887 నవంబరు 20న ఆదివారం జరిగే ఉత్సవానికి చిన్న తెరేస వారి తండ్రితో యాత్రగా రోము చేరుకున్నారు. మోకరిల్లి పోపుగారి ఉంగరం ముద్దాడి తన సమస్యను తెల్పారు. పోపుగారు నవ్వి మఠ పెద్దలు చెప్పినట్లు నడచుకొమ్మని సలహా ఇచ్చారు.

ఎట్టకేలకు 16 సం||లు వయస్సు ప్రవేశించి మూడు నెలలు గడచిన పిమ్మట చిన్న తెరేసకు పెద్దల అనుమతి లభించి 1888 ఏప్రిల్ 9వ తేదీన లిసీయుక్స్ ఒకసారి ఈ చిన్న సిస్టరుగారు తోట పనిచేస్తూ దేవుని పాటను గానం చనుండగా ఒక చిన్న బాలుడు వారి! దర్శనమయ్యాడు. చిన్న తెలీన ఆ బాలుని ఎతుకొని ముద్దాడి 'నీ పేరేంటి ?' అని లాలనగా అడిగారు. ముందు నీ పేరు చెప్పు , అని బాలుడు అడగా “బాల యేసుపు యొక్క చిన్న తెరేస" అని చెప్పగా ఆ బాలుడు బదులుగా 'నా పేరు చిన్న తెస యొక్క బాలయును' అని అదృశ్యమయ్యాడు. అప్పుడు అర్థమైంది. చిన్న తెరేసర్క ఆనిప్పటి వరకు మాట్లాడింది స్వయంగా దివ్య బాలయేసుతోనేనని,

స్వేచ్చను అణచుకొనుటలోనే తపో సంపన్నత ఇమిడి ఉందని చిన్న తెరేసమ్మగారు తలపోశారు. మఠకట్టుబాట్లు గౌరవించటం, పెద్దల ఆజ్ఞలను విధేయించటం, విరామ సమయాల్లో కాలం వెళ్లబుచ్చక వృద్ధ మఠవాసినుల బట్టలు ఉతకడం, ఎండబెట్టి, మడత పెట్టి వారికి అందించడం చేసేవారు. తనకు అవసరం ఉన్న వస్తువుల్నికూడ తోడి సిస్టర్లకు ఇచ్చి తాను "స్వేచ్ఛాపూర్వక దారిద్ర్యం అనుభవించేవారు,

చిన్న తెరసమ్మగాం మంచిపనులు, మాతృకచూసి ముర శ్రేష్ఠరాలమ్మగారు తెరేసు కార్మాలు సభలో కస్య స్త్రీలగుటకు వచ్చిన నివీసులపై పెద్దగా నియమించారు. ఈ బాధ్యతలను సమర్థతో నెరవేర్చారు. చిన్న తెరసమ్మగారు, దేవుని

ప్రేమ, సోదర ప్రేమ, విశ్వాసంలో బలపడాలని వారికి ఆచరణాత్మకంగా బోధించేవారు. ఎవరేమైనా తప్పు చేస్తే తల్లి ప్రేమతో వారిని సరిదిద్దుకునేలా చేసేవారు. ఇల్లు, గుడి, తోటపనుల్లో, బైబిలు పరసంలో వారిని నిషాతుల్ని చేసేవారు. అయితే వారి మఠ శ్రేష్ఠు రాలమ్మగారి ఆదేశం చొప్పున చిన్న తెరేసగారు 'ఒక ఆత్మయొక్క గాథ' పేరుతో తమ స్వీయ చరిత్రను వ్రాశారు,

చిన్న తెరేసమ్మగారి తండ్రి తన వృద్ధాప్యంలో 1894 జూలై 29న చనిపోగా చిన్నతెరేసగారు ఉత్తరించు స్థల ఆత్మల విమోచనకై ప్రత్యేక ప్రార్థనలు సల్చారు. ఆ రోజుల్లో అంత చిన్న ప్రాయంలోనే చిన్న తెరేసగార్కి క్షయరోగం సంప్రాప్తించింది, వారి ముఖంలో చిరునవ్వులు మాత్రం చెరిగిపోలేదు. తనకు మరణం ఆసన్నమైందని తెలసు కున్నారు కాబోలు. “నా పరలోక జీవితాన్ని భూలోక వాసుల మేలుకోసమే ఉపయోగిస్తాను. నా మరణానంతరం రోజాపూల వర్షం కురిపిస్తాను, ప్రపంచమంతా నన్ను అభిమానిస్తారు” అని ప్రవచనం చెప్పారు. 1897 జూలై 30న వారికి కడపటి సంస్కారం ఐన అవస్థాభ్యంగం ఇవ్వబడింది. 1897 ఆగష్టు 16న రక్తం క్రక్కుకొనుటవల్ల జ్ఞాన వింధంగానే సత్ప్రసాదం లో కొన్నారు. 1897 సెప్టెంబరు 30వ తేదీన సాయంత్రం 7.00 గంటలకు స్వర్గస్తులయ్యారు.

మరణానంతరం చిన్న తెరేసమ్మగారు ఒక కన్యస్త్రీకి దర్శనమై 'నా సమాధి తెరువ బడుతుంది. నా అస్థికల ద్వారా అనేక అద్భుతాలు జరుగుతాయి.' అని చెప్పి అంతర్ధాన మయ్యారు. వారు చెప్పినట్లుగానే 1910 సెప్టెంబరు 5న వారి సమాధి తెరవబడింది. వారిని ప్రార్థించిన వారు ఎందరికో అద్భుత మేలులు ఒనగూరాయి. 11వ భక్తినాథ పోపుగారి ద్వారా 1923లో ధన్యత పట్టాను 1925లోను పునీత పట్టానిచ్చి 'శ్రీ సభ వారిని గౌరవించింది. 1927లో చిన్న తెరేసమ్మగారు తమ ప్రార్థన, ఆదర్శం, తర్ఫీదు ద్వారా వేద వ్యాపకంలో పునీత ఫ్రాన్సిసు శౌరి వారంతటి గొప్పవారని అదే పరిశుద్ద పోపుగారు బిరుదమునిచ్చి కొనియాడారు. తెరేస అనేది ఒక దీవి పేరు.

Subscription

You do not have an active subscription. Subscribe Below


Welcome User

Signup/Login with your Phone Number to continue with Bharathamithram
LOGIN