ఫ్రాన్స్ పర్యటనను ‘విశ్వాస పునరుజ్జీవనానికి సంకేతం’గా అభివర్ణించిన పోప్

జోసెఫ్ అవినాష్

30 Sep 2026

పోప్ లియో XIV ఫ్రాన్స్‌లో తన అపోస్తలిక పర్యటనను విశ్వాసం,శాంతి,మానవ జీవితం పట్ల గౌరవానికి సంబంధించిన ఒక ముఖ్యమైన అనుభవంగా అభివర్ణించారు. సెప్టెంబర్ 25 నుంచి 28 వరకు జరిగిన ఈ పర్యటనలో యువతతో సమావేశమై,విశ్వాసాన్ని కొత్త తరాలకు అందించాల్సిన అవసరాన్ని ఆయన గుర్తుచేశారు.పారిస్‌లో అగ్నిప్రమాదం తర్వాత పునర్నిర్మించబడిన నోట్ర్-డామ్ కేథడ్రల్‌ను ప్రస్తావిస్తూ,కష్టాలు మరియు విధ్వంసం తర్వాత కూడా పునరుజ్జీవనం సాధ్యమేనని తెలిపారు.అలాగే ప్రపంచంలో నెలకొన్న యుద్ధాలు,ఘర్షణల మధ్య శాంతి కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.మానవ జీవితంలోని ప్రతి దశకు గౌరవం ఇవ్వాలని,సమాజంలో పరస్పర సహకారం మరియు మానవ గౌరవం మరింత బలపడాలని పోప్ లియో XIV ఆకాంక్షించారు.

Subscription

You do not have an active subscription. Subscribe Below


Welcome User

Signup/Login with your Phone Number to continue with Bharathamithram
LOGIN