పాదువా పుర అంథోని వారికి ప్రణతులు !

కొండవీటి అంతయ్య, సత్తెనపల్లి

29 Sep 2026

పాదువా పుర అంథోని వారికి ప్రణతులు !
----------------------------------------------------------------

ఆ .వె:
1.చేత లిల్లి పూవు చెంగట బాలుడు
పొత్తముండు రూపు చిత్తమందు
చెరిగి పోదు యెపుడు జే జే లు పలుకుదు
పాదువ పుర స్వామి ప్రణతి సేతు !

2.బుజ్జి బాల యేసు భుజమెక్కి కూర్చుండ
ముద్దు లెన్నొ పెట్టి సుద్దులాడి
అమ్మ మరియ వోలె ఆడించి నావయ్య
పాదువ పుర స్వామి ప్రణతి సేతు!

3.అర్చ్య శిష్టులందు అధిక మన్నన కల్గి
అద్భు తాలు చేసి ఆదుకొనుచు
సానుభూతి తొడ సాయమందించేవు
పాదువ పుర స్వామి ప్రణతి సేతు!

4.పారవేసుకున్న గారాబు వస్తువుల్
దొరకజేసి బ్రోచు దొరవు నీవు
మరియ తనయునెత్తి మురిపించు మూర్తివి
పాదువ పుర స్వామి ప్రణతి సేతు !

5.భక్తి తోడ జనులు పంచి పెట్టు దురంట
తట్ట నిండ తెచ్చి రొట్టెలెన్నొ
అన్ని మేళ్లు నీవు అందింతు వంటగా
పాదువ పుర స్వామి ప్రణతి సేతు!

Subscription

You do not have an active subscription. Subscribe Below


Welcome User

Signup/Login with your Phone Number to continue with Bharathamithram
LOGIN