పంచి పెట్టు వాడె పండితుండు!.

డా. కల్లూరి ఆనందరావు
28 Sep 2026
సూక్తులు (జ్ఞాన గ్రంథము)
................................................................
బిరుదులున్న వాడె పెను పండితుడు కాదు!
చేతి కంకణమ్ము ఖ్యాతి నిడదు!
నేర్చుకున్న విద్య నలుగురి ప్రగతికై
పంచి పెట్టు వాడె పండితుండు!.
