మతాల మధ్య సంభాషణతోనే శాంతి సాధ్యం: పోప్

జోసెఫ్ అవినాష్

28 Sep 2026

ఫ్రాన్స్‌లోని మెట్జ్ నగరంలో పర్యటిస్తున్న పోప్ వివిధ మతాల ప్రతినిధులతో జరిగిన సమావేశంలో పాల్గొని మతాల మధ్య పరస్పర అవగాహన,స్నేహభావం,శాంతి ఎంతో ముఖ్యమని అన్నారు.యూరోపియన్ యూనియన్ వ్యవస్థాపకుల్లో ఒకరైన రాబర్ట్ షూమాన్‌ను గుర్తుచేస్తూ,భిన్నాభిప్రాయాలను విభేదాలుగా కాకుండా ఆశకు వారధులుగా మార్చుకోవాలని పిలుపునిచ్చారు.మతాల మధ్య సంభాషణ వల్ల మన విశ్వాసం తగ్గదని,ఇతరుల విశ్వాసాలను గౌరవిస్తూ స్నేహాన్ని పెంపొందించుకోవచ్చని తెలిపారు.హింసను లేదా అణచివేతను సమర్థించడానికి దేవుని నామాన్ని ఉపయోగించడం దేవుని నామాన్ని అపవిత్రం చేయడమేనని స్పష్టం చేశారు.మానవ గౌరవాన్ని దెబ్బతీసే ఏ పనీ దేవుని ప్రేరణతో జరిగిందని చెప్పలేమని అన్నారు.మతాలు ప్రతి మనిషి జీవితానికి విలువనివ్వాలని,ముఖ్యంగా బలహీనులను,ఆపదలో ఉన్నవారిని ఆదుకోవాలని పిలుపునిచ్చారు.ఒక నాగరికత గొప్పతనం దాని భౌతిక అభివృద్ధిలో కాకుండా,మనుషులను ఎంతగా గౌరవించి, కాపాడుతుందనే దానిలో ఉంటుందని చెప్పారు.

Subscription

You do not have an active subscription. Subscribe Below


Welcome User

Signup/Login with your Phone Number to continue with Bharathamithram
LOGIN