విశ్వ నరుడు! (మహాకవి జాషువా గారి జయంతి నేడు సెప్టెంబర్ 28)

కొండవీటి అంతయ్య, సత్తెనపల్లి

28 Sep 2026

తెలుగు వారి గర్వం
జాషువా గుర్రం!
విద్యయే ఆయన ధనం
సాహిత్యమే ఆయన బలం!

తెలుగు కవనాకాశంలో గుర్రం జాషువా
వెలుగు కిరణాల తోరణం కట్టిన ఓ వేకువ!

దళిత పేద కుటుంబంలో పుట్టిన మహా కవి
పాండిత్య ప్రతిభతో నిత్యం ప్రకాశించే కళా రవి!

సాహితీలోకంలో ఆయనదెప్పుడూ అగ్రాసనం
అగ్రకుల అహంకారానికి ఆయన పలికాడు భరత వాక్యం!

పిరదౌసీ కథ చెప్పి కవులను ప్రజల నాలుకలపై నిలిపాడు
గబ్బిలాన్ని ఎగిరించి అణగారిన వర్గాల వ్యథను వివరించాడు!

కాటి సీను పద్యాలతొ పామరులను గెలిచాడు
కలకాలం తెలుగునాట విశ్వ నరుడై నిలిచాడు!

పగటికి దినకర తేజం
రేయికి చంద్రుని కిరణం
నింగికి తారా తోరణం
తెలుగు వారికి జాషువా కవిత్వం!!!

Subscription

You do not have an active subscription. Subscribe Below


Welcome User

Signup/Login with your Phone Number to continue with Bharathamithram
LOGIN