త్రిత్వ దైవ స్తుతి - తేట గీతి!

కొండవీటి అంతయ్య, సత్తెనపల్లి

28 Sep 2026

1.శ్రీకరముగాను వాక్కుయే సిద్ధి నంది
   ఆదియందున పిత దైవ మవతరించె
  మాన కెప్పుడు పిత దైవ స్మరణ చేసి
  భక్తితో త్రిత్వ దేవుని భజన సేతు!

2.తానె దేవుడై యా పిత లోన యున్న
అతులిత మహిమ రూపుడు సుతుని దలచి
దివ్య కొమరుని కొల్చుచూ భవ్య రీతి
భక్తితో త్రిత్వ దేవుని భజన సేతు!

3.పిత సుతునియందు లీనమై సతత ముండు
ఆత్మ దేవుని దలంచి యాదరాన
స్తోత్ర గీతము పాడుచూ స్తుతులు సలిపి
భక్తితో త్రిత్వ దేవుని భజన సేతు!

Subscription

You do not have an active subscription. Subscribe Below


Welcome User

Signup/Login with your Phone Number to continue with Bharathamithram
LOGIN