అక్టోబర్‌లో శాంతి కోసం జపమాల ప్రార్థన చేయాలని పిలుపునిచ్చిన పోప్
జోసెఫ్ అవినాష్
27 Sep 2026
విశ్వ కాపరి పోప్ లియో XIV ఫ్రాన్స్ లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే.సెప్టెంబర్ 27న ఫ్రాన్స్‌లోని లూర్దు పుణ్యక్షేత్రంలో దివ్యబలిపూజను ముగించిన అనంతరం పోప్ లియో XIV ప్రపంచ శాంతి కోసం అక్టోబర్ నెలలో ప్రత్యేకంగా జపమాల ప్రార్థన చేయాలని క్రైస్తవులకు పిలుపునిచ్చారు.లూర్దులో మరియతల్లి పునీత బెర్నదెత్తకు జపమాలతో దర్శనమిచ్చి ప్రార్థనకు మార్గనిర్దేశం చేసిన విషయాన్ని గుర్తుచేస్తూ, యుద్ధాలు ముగిసి,సంఘర్షణలతో బాధపడుతున్న ప్రజల మధ్య శాంతి నెలకొనాలని జపమాల ప్రార్థన చేయాలని కోరారు.ప్రార్థనతో పాటు పశ్చాత్తాప కార్యాలు,దయాపూర్వక సేవలు చేపడుతూ,సంభాషణకు,సయోధ్యకు కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
