కీ. శే. డాక్టర్ దేవదాస్ బెర్నాడ్ గారికి శ్రద్ధాంజలి

ఫాదర్ చల్ల డేవిడ్ (భారతమిత్రం, ప్రధాన సంపాదకులు)

26 Sep 2026

భారతమిత్రం ప్రముఖ రచయిత, కవి డాక్టర్ దేవదాస్ బెర్నాడ్ గారి మరణం తెలుగు శ్రీసభ సాహిత్యానికి తీరని లోటు.అనేక కళాశాలలో ప్రిన్సిపాల్ గా,భారత మిత్రమలో చాలా చక్కని రచనలు చేసి యవ్వన కవులకు,రచయితలకు,సంపాదకులకు తనదైన శైలిలో సూచనలు సలహాలను ఇచ్చి,తెలుగు కతోలిక క్రైస్తవ సాహిత్యానికి సంబంధించి కవితలు,వ్యాసాలు,పద్యాలు, ఉదయ సప్తకం,గుర్రం జాషువా క్రైస్తవ సాహిత్యం,గాథా సహస్ర వతి ఇలా అనేక విధాలుగా తెలుగు క్రైస్తవ కతోలికి సాహిత్య అభివృద్ధికి బాటలు వేసిన గొప్ప కవితావేషం కలిగిన క్రైస్తవ కవులు లో గొప్ప స్థానాన్ని అధిరోహించిన క్రీస్తు తత్వాన్ని,శ్రీసభ సాంప్రదాయాలను పండితులకే కాదు పామరులకు సైతం రచనలు చేసి,అనేకమందికి క్రీస్తు రక్షణ సువార్తను తన జీవిత విధానములో బోధించి వేల మందికి సువార్తను చాటిన సుమాతృక గృహస్థ క్రైస్తవుడు,అనేకమంది పీఠాధిపతులతో సత్సంబంధాలు కలిగిన మన ప్రియతమ భారతమిత్రం రచయిత మరణం తెలుగు కతోలిక శ్రీసభకు,మరి ముఖ్యంగా భారతమిత్రంకు తీరని లోటు.తన చివరి మాటలు: ఫాదర్, నేను మరణించినంతవరకు క్రీస్తుకు సాక్షిగా రచనలు చేస్తూనే ఉంటాను. క్రైస్తవ సాహిత్యానికి నా వంతు కృషి చేస్తాను.

Subscription

You do not have an active subscription. Subscribe Below


Welcome User

Signup/Login with your Phone Number to continue with Bharathamithram
LOGIN