ప్రతి ఒక్కరి మేలుకు దోహదపడేదే నిజమైన అభివృద్ధి - పోప్

జోసెఫ్ అవినాష్

24 Sep 2026

పోప్ లియో XIV సెప్టెంబర్ 23న జరిగిన సాధారణ ప్రేక్షకుల సమావేశంలో రెండవ వాటికన్ మహాసభలోని Gaudium et Spes బోధనలపై తన ప్రసంగాన్ని కొనసాగించారు.ఆయన మాట్లాడుతూ,మానవ అభివృద్ధి అనేది కేవలం శాస్త్ర, సాంకేతిక రంగాల్లో సాధించే పురోగతికి మాత్రమే పరిమితం కాకూడదని అన్నారు.మానవుడు తన జ్ఞానం,స్వేచ్ఛ,శ్రమను ఉపయోగించి సృష్టిని అభివృద్ధి చేయాలని,అయితే ఈ అభివృద్ధి దేవునితో మనిషికి ఉన్న సంబంధాన్ని దూరం చేయకూడదని ఆయన పేర్కొన్నారు.మనం చేసే వృత్తి, బాధ్యతలు,రోజువారీ పనుల ద్వారా కూడా దేవుని ప్రణాళికలో భాగస్వాములం కావచ్చని వివరించారు.నిజమైన పురోగతి ప్రేమతో ప్రేరేపించబడి,ప్రతి మనిషి గౌరవాన్ని కాపాడుతూ,ముఖ్యంగా పేదలు,బలహీనులు,వెనుకబడిన వారి జీవితాలను మెరుగుపరిచేదిగా ఉండాలని పోప్ స్పష్టం చేశారు.జ్ఞానం,నైపుణ్యాలను స్వార్థం కోసం కాకుండా పరస్పరం పంచుకుంటూ,అందరికీ మేలు చేసే మెరుగైన భవిష్యత్తును కలిసి నిర్మించాలని ఆయన పిలుపునిచ్చారు.

Subscription

You do not have an active subscription. Subscribe Below


Welcome User

Signup/Login with your Phone Number to continue with Bharathamithram
LOGIN