(తేటగీతులు)

కొండవీటి అంతయ్య, సత్తెనపల్లి
23 Sep 2026
1.సత్రమందున కొంచెము స్థలము లేక
పసుల గాడియే పాన్పుగా ప్రభవమంది
దీన గుణమును చాటిన మాన నీయ
బాల యేసువా!నిన్ను నే భక్తి కొలుతు!
2.పావురాయి రూపుని వరమీవు గాన
పురిటి నొప్పులు లేకయే పుడమిపైన
నిన్ను గన్నది మరియమ్మ కన్నె గానె
బాల యేసువా!నిన్ను నే భక్తి కొలుతు !
