CCBIలో కొత్త నియామకాలు

జోసెఫ్ అవినాష్
23 Sep 2026
అఖిలభారత కతోలిక పీఠాధిపతుల సమాఖ్య వివిధ సేవ విభాగాలకు నూతన నియామకాలను ప్రకటించింది.బెంగళూరులో సెప్టెంబర్ 15, 16 తేదీల్లో జరిగిన CCBI కార్యవర్గ కమిటీ సమావేశంలో ఈ కొత్త నియామకాలకు ఆమోదం లభించింది. విజయవాడ పీఠానికి చెందిన గురువులు ఫాదర్ దర్శి డాన్ బోస్కో గారు సహాయక ఉపకార్యదర్శిగా నియమితులయ్యారు.ఫాదర్ విజయవాడ పీఠంలో ప్రేరణ యువజన శిక్షణ కేంద్రాన్ని ఆయన స్థాపించారు. అలాగే అమెరికాలో సెయింట్ జోసెఫ్ సెమినరీలో వేదాంతచార్యులుగా సేవలందించారు. కర్ణాటక కు చెందిన ఫాదర్ స్టీఫన్ అరుణ్ బోస్కో సమాఖ్య పర్యావరణ విభాగానికి కార్యదర్శిగా నియమితులయ్యారు. విశాఖ అగ్ర పీఠానికి చెందిన గురువులు ఫాదర్ మరిపి ప్రతాప్ కుమార్ కుటుంబ సేవా విభాగానికి కార్యదర్శిగా నియమితులయ్యారు.భోపాల్ అగ్ర పీఠానికి చెందిన ఫాదర్ అలెగ్జాండర్ యెసుదాసన్ ను యంగ్ కాథలిక్ స్టూడెంట్స్/యంగ్ స్టూడెంట్స్ మూవ్‌మెంట్ విభాగానికి కార్యదర్శిగా ఎన్నుకున్నారు.
