కృత్రిమ మేధస్సు మానవ గౌరవాన్ని కాపాడుతూ శాంతికి సాధనంగా మారాలి - పోప్
జోసెఫ్ అవినాష్
23 Sep 2026
పోప్ లియో XIV మాట్లాడుతూ,సంఘర్షణలు మరియు విభేదాలతో నిండిన ప్రపంచంలో కృత్రిమ మేధస్సు (AI) అభివృద్ధి కేవలం సాంకేతిక నైపుణ్యంతోనే కాకుండా వివేకం, ప్రేమ,మానవ గౌరవం పట్ల శ్రద్ధతో సాగాలని అన్నారు.సాంకేతిక పురోగతి ప్రతి వ్యక్తి గౌరవాన్ని కాపాడుతూ, మానవ కుటుంబాన్ని ఏకం చేసే బంధాలను బలోపేతం చేయాలని ఆయన సూచించారు.రోమ్‌లోని పొంతిఫికల్ లాటరన్ విశ్వవిద్యాలయంలో జరిగిన తొలి AI4Peace అంతర్జాతీయ సదస్సుకు పంపిన సందేశంలో, సంఘర్షణల నివారణ,శాంతి నిర్మాణం,మానవ హక్కుల పరిరక్షణ,ప్రపంచ పాలన వంటి రంగాల్లో AI వల్ల కలిగే అవకాశాలు,సవాళ్లను పరిశీలించాలని కోరారు.ముఖ్యంగా AIను ఇతరుల మేలును దృష్టిలో ఉంచుకుని అభివృద్ధి చేసి, ఉపయోగించినప్పుడు అది ప్రజల మధ్య సంభాషణ, సయోధ్య,సంఘీభావాన్ని పెంపొందించే శాంతి సాధనంగా మారగలదని పోప్ పేర్కొన్నారు.
