శాంతి కోసం పోప్‌తో కలిసి జపమాల ప్రార్థించనున్న వందలాది మంది పిల్లలు
జోసెఫ్ అవినాష్
22 Sep 2026
అక్టోబర్ 1న రోమ్‌లోని వాటికన్ ఉద్యానవనాల్లో వందలాది మంది పిల్లలు పోప్ లియో XIVతో కలిసి శాంతి కోసం జపమాల ప్రార్థన చేయనున్నారు. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న యుద్ధాలు, హింస, పేదరికం, బాధల నుంచి ప్రజలకు విముక్తి కలగాలని, ప్రపంచంలో శాంతి నెలకొనాలని ప్రార్థిస్తూ ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు.సాయంత్రం 5 గంటలకు వాటికన్‌లోని లూర్దు మాత గుహ వద్ద పోప్‌తో కలిసి పిల్లలు జపమాల ప్రార్థనలో పాల్గొంటారు.ఈ కార్యక్రమం అక్టోబర్ 1 నుంచి 7 వరకు కొనసాగి,అక్టోబర్ 7న జరిగే జపమాల మాత పండుగతో ముగుస్తుంది.ప్రపంచవ్యాప్తంగా ఉన్న పిల్లలు, కుటుంబాలు,పాఠశాలలు, విచారణలు కూడా ఈ ప్రార్థనలో భాగస్వాములు కావాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు.
