దేవుని వాక్యాన్ని మీ చెవులతో, మీ హృదయంతో వినండి

జోసెఫ్ అవినాష్
21 Sep 2026
సామాన్య 25వ మంగళవారం
సువిశేష ధ్యానం-:
లూకా 8:19-21
యేసు ప్రజలను ప్రేమించారు. వారితో మాట్లాడటం కొనసాగించారు."నన్ను అనుసరించే వారు నా తల్లి, నా సోదరులు" అని ఆయన చెప్పారు.దీని అర్థమేమంటే 'దేవుని వాక్యాన్ని విన్నవాళ్ళు దాన్ని ఆచరణలో పెట్టాలని, యేసును అనుసరించడానికి రెండు షరతులు:దేవుని వాక్యాన్ని వినడం,విన్న దానిని ఆచరణలో పెట్టడం.ఇదే క్రైస్తవ జీవితం,ఇంతకూ మించి ఇంకేమీ లేదు.
అందుకే
- లూకా సువార్త (8:19-21)లో వివరించినట్లుగా తన
బంధువులు తన కోసం వెతుకుతున్నారని వార్త తెలిపిన వారితో యేసు ఇలా సమాధానమిచ్చాడు,నా తల్లి మరియు నా సోదరులు దేవుని వాక్యాన్ని విని, దానిని ఆచరణలో పెట్టేవారని వినడమంటే మామూలుగా వినడం కాదు. శ్రద్ధగా దేవుని వాక్యాన్ని వినడం.దేవుని వాక్యాన్ని వినడం అంటే దాన్ని చదివి, ‘ఆ వాక్యం నాతో ఏమి చెబుతోంది? ఇది నా హృదయంతో ఎలా మాట్లాడుతుంది? ఈ వాక్యంతో దేవుడు నాతో ఏమి చెప్తున్నారు? అని మనం ప్రశ్నించుకోవాలి,మనం ఇలా చేసిన ప్రతిసారీ బైబిల్ గ్రంథాన్ని తెరిచి,ఒక సువార్త భాగాన్ని చదివి 'దేవుడు నాతో ఇలా మాట్లాడుతున్నాడా? అతను నాతో ఏదో చెబుతున్నాడా? అని ధ్యానించాలి'. అతను ఏదైనా చెబుతుంటే, దీని అర్థం ఏమిటని ప్రశ్నించుకోవాలి. దేవుని వాక్యాన్ని మీ చెవులతో, మీ హృదయంతో వినండి.మీ హృదయాన్ని తెరవండి. ప్రభువు ఎల్లప్పుడూ తన వాక్యాన్ని విత్తుతూనే ఉన్నారు. వినడానికి దానిని ఆచరణలో పెట్టడానికి ఇష్టపడే హృదయాన్ని మాత్రమే కలిగి ఉండాలని ఆ ప్రభువు మనలను కోరతాడు.
