దేవుని ఆలోచనలు మన ఆలోచనలకంటే ఎంతో గొప్పవి: పోప్
జోసెఫ్ అవినాష్
21 Sep 2026
సెప్టెంబర్ 20, 2026న ఆదివారం ఏంజెలస్ ప్రార్థన సందర్భంగా పోప్ లియో XIV,ద్రాక్షతోటలో పనిచేసిన కూలీల ఉపమానాన్ని ఆధారంగా చేసుకుని విశ్వాసులకు సందేశం ఇచ్చారు.దేవుని ఆలోచనలు మన ఆలోచనల వంటివి కావని,ఆయన మార్గాలు మన మార్గాలకంటే ఎంతో గొప్పవని పోప్ గుర్తుచేశారు.మనుషులు సాధారణంగా అర్హత,ప్రతిఫలం, పోలికల ఆధారంగా ఆలోచిస్తారని,అయితే దేవుని న్యాయం కృప,దయ,ప్రేమలపై ఆధారపడి ఉంటుందని వివరించారు. రోజంతా పనిచేసినవారితో పాటు చివరి గంటలో వచ్చినవారికీ యజమాని సమానమైన కూలీ ఇవ్వడం ద్వారా, దేవుని మంచితనం కొందరికే పరిమితం కాదని యేసు తెలియజేస్తున్నారని ఆయన చెప్పారు.
