మనకు దివ్యసంస్కారాల అవసరమేమిటి?

కతోలిక శ్రీసభ సత్యోపదేశం

20 Sep 2026

యేసుప్రభువు ద్వారా,యేసుప్రభువు మాదిరి మన జీవితాలను మార్చుకోడానికి, అంటే సంపూర్ణ స్వేచ్ఛ, మహిమా ప్రాభవాలు గల దేవుని సంతానంగా మారడానికీ,అల్పమైన మన మానవ సహజ బలహీనతలను లోటుపాటులను అధిగమించడానికి మనకు ఈ ఏడు దివ్య సంస్కారాలు అవసరం. (CCC1129) జ్ఞానస్నాన సంస్కారం ద్వారా పతనమైన మానవ సంతతివారు రక్షింపబడి దేవుని సంతానంగా మారారు. పవిత్రాత్మ ధ్రువీకరణసంస్కారం ద్వారా శక్తిహీనులు శక్తిమంతులవుతున్నారు, అంకితభావంగల క్రైస్తవులవు తున్నారు,ప్రాయశ్చిత్త సంస్కారం (పాప సంకీర్తనం) ద్వారా అపరాధులు దేవునితో సఖ్యపడుతున్నారు. దివ్యసత్ప్రసాద సంస్కారం ద్వారా ఆకలి గొనినవారే ఇతరుల ఆకలి తీర్చగలుగుతున్నారు.పవిత్ర వివాహ సంస్కారం ద్వారా, గురుపట్టం (పవిత్ర అభిషేకం) దివ్యసంస్కారం ద్వారా వైయక్తిక జీవనానికి అలవాటు పడినవారు ప్రేమమూర్తులైన పరిచారకులుగా పరివర్తనం చెందుతున్నారు.వ్యాధిగ్రస్తుల అభ్యంగన సంస్కారం (స్వస్థతా సంస్కారం) ద్వారా నిరాశా నిస్పృహలతో కుంగిపోయేవారు కోలుకొని ఆత్మవిశ్వాసం గల వ్యక్తులవుతారు. ఈ దివ్యసంస్కారాలన్నింటిలో నిగూఢంగా ఉన్న పరమ దివ్యసంస్కారం సాక్షాత్తు క్రీస్తు ప్రభువే! ఆయన ద్వారానే - స్వార్థపరులమై దారితప్పిన మనం దరిచేరగలుగుతాం, ప్రభుక్రీస్తు ద్వారానే అంచెలు అంచెలుగా ఆధ్యాత్మిక పరిణతిపొందుతూ కడకు సత్యజీవద్భాగ్యాన్ని పొందగలుగుతాం.

Subscription

You do not have an active subscription. Subscribe Below


Welcome User

Signup/Login with your Phone Number to continue with Bharathamithram
LOGIN