కుటుంబ సేవా విభాగానికి కార్యదర్శిగా ఫాదర్ ప్రతాప్ కుమార్ నియామకం

జోసెఫ్ అవినాష్

19 Sep 2026

విశాఖ అగ్ర పీఠానికి చెందిన ఫాదర్ మరిపి ప్రతాప్ కుమార్ గారిని అఖిల భారత కతోలిక పీఠాధిపతుల సమాఖ్య (CCBI) కుటుంబ సేవా విభాగానికి కార్యదర్శిగా నియమించారు.బెంగళూరులో సెప్టెంబర్ 15, 16 తేదీల్లో జరిగిన అఖిల భారత కతోలిక పీఠాధిపతుల సమాఖ్య కార్యనిర్వాహక కమిటీ సమావేశంలో ఈ నియామకాన్ని ప్రకటించారు.కుటుంబ జీవితం,గృహస్థ క్రైస్తవ సేవలకు సంబంధించిన కార్యక్రమాల్లో ఇప్పటికే అనుభవం ఉన్న ఫాదర్ ప్రతాప్ కుమార్,ఈ కొత్త బాధ్యత ద్వారా దేశవ్యాప్తంగా కుటుంబ సేవ విభాగానికి తన విశిష్టమైన సేవలందించనున్నారు 1988 జనవరి 8న విజయనగరంలో జన్మించిన ఆయన 2016 మార్చి 31న గురువుగా అభిషేకం పొందారు.ఇంగ్లిష్‌లో మాస్టర్స్ డిగ్రీతో పాటు కుటుంబ కౌన్సిలింగ్ విభాగంలో పోస్ట్‌గ్రాడ్యుయేట్ డిప్లొమా పొందిన ఆయన,గురువుగా వివిధ బాధ్యతలు నిర్వహించారు.2024 నుంచి విశాఖ అగ్ర పీఠానికి కుటుంబ మరియు గృహస్థ క్రైస్తవ సేవా విభాగాలకు కార్యదర్శిగా, అలాగే తెలుగు కతోలిక పీఠాధిపతుల మండలి (TCBC) కుటుంబ మరియు గృహస్థ క్రైస్తవ సేవా విభాగాలకు ప్రాంతీయ కార్యదర్శిగా సేవలందిస్తున్నారు.

Subscription

You do not have an active subscription. Subscribe Below


Welcome User

Signup/Login with your Phone Number to continue with Bharathamithram
LOGIN