NISCORT డైరెక్టర్‌గా ఫాదర్ మార్టిన్ సాదిక్ నియామకం

జోసెఫ్ అవినాష్

18 Sep 2026

న్యూఢిల్లీలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ కమ్యూనికేషన్స్,రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (NISCORT) డైరెక్టర్‌గా జలంధర్ పీఠానికి చెందిన ఫాదర్ మార్టిన్ సాదిక్ నియమితులయ్యారు.సెప్టెంబర్ 17న బెంగళూరులో జరిగిన అఖిల భారత కతోలిక పీఠాధిపతుల సమాఖ్య కమిటీ సమావేశంలో ఈ నియామకాన్ని సమాఖ్య అధ్యక్షులు కార్డినల్ మహా ఘన.అంతోని పూల గారు ప్రకటించారు. అక్టోబర్ 15 తర్వాత ఫాదర్ మార్టిన్ సాదిక్ కొత్త బాధ్యతలను స్వీకరించనున్నారు.1998లో గురువుగా అభిషేకం పొందిన ఆయనకు కతోలిక మాధ్యమ రంగంలో రెండు దశాబ్దాలకు పైగా అనుభవం ఉంది.జర్నలిజం,ప్రసార మాధ్యమాలు,చిత్ర నిర్మాణం,ఫొటోగ్రఫీ,డిజిటల్ కమ్యూనికేషన్ వంటి రంగాల్లో ఆయన సేవలందించారు.జలంధర్ పీఠంలో మాస్ మీడియా అండ్ కమ్యూనికేషన్ కమిషన్ డైరెక్టర్‌గా,Sada Zamana వారపత్రిక ప్రధాన సంపాదకుడిగా కూడా పనిచేశారు.NISCORTలో తన కొత్త బాధ్యతల్లో భాగంగా ప్రాయోగిక మీడియా విద్య,డిజిటల్ సువార్తీకరణ,కృత్రిమ మేధస్సు (AI), డిజిటల్ జర్నలిజం,పాడ్‌కాస్ట్‌లు,లైవ్ ప్రసారాలు వంటి ఆధునిక కమ్యూనికేషన్ రంగాలకు ప్రాధాన్యం ఇవ్వాలని ఆయన భావిస్తున్నారు.అలాగే గురువులు, కన్యా స్త్రీలు,పీఠాధిపత్యాల కమ్యూనికేషన్ సిబ్బందికి ప్రత్యేక మీడియా శిక్షణ అందించడంపై కూడా దృష్టి పెట్టనున్నారు.

Subscription

You do not have an active subscription. Subscribe Below


Welcome User

Signup/Login with your Phone Number to continue with Bharathamithram
LOGIN