నేటి పునీతులు: పునీత కుపెరీనొ యోసేపు

క్రీస్తు జ్యోతులు మన పునీతులు
18 Sep 2026
ఎగిరే పునీతుడు'గా పేర్గాంచిన దెస్సాయోసేపుగారు ఇటలీదేశంలో బ్రిందిసి నగర దాపునగల 'కుపడ్డీనో' అనే ఊల్లో ఒక పేదకుటుంబంలో క్రీIIశl 1603 జూన్ 17వ తేదీన జనియించారు. వీరి తండ్రి చెప్పులుకుట్టేపని చేసేవారు. ఇంటి వెనుక ఖాళీగా ఉన్న ఒక చిన్న ఇంటిలో ఈ పునీతుడు పుట్టారు. పేదరికంవల్ల వారితల్లి కుమారుడు యోసేపుని జీవిత భారంగా ఎంచుకుని అలక్ష్యంచేసింది.
యోసేపు దెస్సాగారు బాల్యంనుండి సరియైన పోషణ లేక ఆలన పాలన లేక అమాయకుడుగా పెరిగారు. పాఠశాలలో చదివేరోజుల్లో 8 సంIIల ప్రాయంలో వారు అలాగే నిలబడి పారవశ్యంలో నోరు తెరచుకొని ఏవో వింత దృశ్యాలను చూసేవారు. అందుకు తోడి విద్యార్థులు వారిని “తెరచిన నోరు కలవాడు' అని ఆట పట్టించేవారు. యో సేపుగారు కూడ చెప్పులు కుట్టేపని కొంతకాలం నేర్చుకున్నారు. తమ 17వ ఏట కపూచియను ఫ్రాన్సీసువారి సభలో సభ్యునిగా చేర ప్రయత్నించారు. కాని అందుకు వారు తిరస్కరింపబడి కేవలం ఒక లౌకిక బ్రదరుగా మాత్రం ఉండుటకు తీసుకోబడ్డారు.
కాని 8 మాసాల అనంతరం వారి నేర్పులేనితనం, తక్కువ జ్ఞానం నెపంతో బ్రదరుగానుండుటకు కూడ తిరస్కరింపబడి బయటకు పంపివేయబడ్డారు. యోసేపుగారు మాత్రం తన ప్రయత్నం మానలేదు. గొట్టెల పట్టణంలోగల ఫ్రాన్సీసుసభవారు మాత్రం యోసేపుగారిని ఒక సేవకుడుగా పనిచేయడానికి చేర్చుకున్నారు. ఫ్రాన్సీసుసభ మూడవ వర్గసభ్యునిగానుండ ప్రవేశం కల్పించారు. అక్కడవారు చాలా సం||లు ఎంతో నమ్మకంగా సేవకుడుగా పనిచేశారు. వారి పశ్చాత్తాప్త పరిత్యాగ జీవితం, వినయ విధేయతల ప్రభావం సభ పాలకులను సంతృప్తి పరచింది. అందువల్ల క్రీ||శ|| 1625లో వారిని గురుశిక్షణ బ్రదరు (నోవిసు)గా తీసుకోబడ్డారు. చదువులోను, ఈ లోక జ్ఞానంలోను పెద్దగా ఎదగకున్నాగాని యో సేపుగారు క్రీ||శ|| 1628లో పవిత్ర గురుపట్టాభిషేకం ఇవ్వబడ్డారు. అప్పటికి వారి ప్రాయం కేవలం 25 సం||లు. పరలోక సంబంధమైన జ్ఞానం వారికి అధికంగా ఉండేది. దైవ జ్ఞాన సంబంధ చిక్కు ప్రశ్నలకు సుళువుగా సమాధానాలిచ్చేవారు. ఎదుటి వారి అంతరంగాలను తెలుసుకునే శక్తి వారికి ఉండేది.
పాపపు హృదయులను తగు విధంగా హెచ్చరించేవారు. యోసేపు దెస్సాగారిలో కొన్ని అద్భుతశక్తులుండేవి. ప్రవచనాలు చెప్పడం, స్వస్థతలు చేకూర్చడం, గాలిలో తేలిపోవడం చేయకలిగేవారు. దాదాపు 70 సార్లు గాలిలో ఎగిరి పక్షిలా వెళ్లకలిగినట్లు ప్రత్యక్షసాక్షులు చెప్పి ఉన్నారు. దేవాలయం భక్తులతో నిండియుండగా దేవాలయ ద్వారంనుండి లోపలి పీఠంవరకు గాలిలో తేలియాడుతూ ఎగిరివెళ్లేవారు. ఎత్తు అయిన ఓలివుచెట్టు చిటారుకొమ్మ మీదకు ఎగిరివెళ్లి అక్కడే కదలకుండ గాలిలో అర్దగంట సేపైనా ప్రార్ధనచేసేవారు.
ఇట్టి అసాధారణమైన ఆశ్చర్యకర అద్బుత ఘట్టాలు నెరవేర్చే యో సేపు దెస్సాగారివల్ల ఫ్రాన్సీసుసభ వారికి వారి మఠాలయాలకు గొప్ప ప్రచారం లభించింది. అందువల్ల సభ పెద్దలు యోసేపుగార్ని మారుమూలన ఉన్న వారి అనేక మఠాలకు తరచూ మారుస్తుండేవారు. కొందరు యోసేపుగారిని అధిక ప్రచారం కోరుకునే వ్యక్తిగా విమర్శించేవారు. అయినాగానీ 8వ అర్బను జగద్గురువులు మాత్రం యో సేపుగారు దైవశక్తి వల్లనే అద్భుతశక్తులు ప్రదర్శింస్తుండటంవల్ల వారి నిష్కపటత్వానికి, పవిత్రతకు సంతృప్తి చెందారు. | పునీత యో సేపుగారు క్రీ||శ|| 1639లో అస్సిసి మఠంకు పంపబడ్డారు. అక్కడవారికి అనేక శోధనలు ఎదురైనాయి. కాని ప్రభువు కృపనుకోరుకుని వారు కుదుటబడి కృతజ్ఞతలు తెల్పుకున్నారు. ఆధ్యాత్మిక జీవితంలో దృఢంగా నిలదొక్కు
కున్నారు. యూరపు అంతట ఆ అద్భుతకరుని ఖ్యాతి విస్తరించింది. క్రీ.శ. 1653లో మారుమూల కొండల పై మరుగై ఉన్న పయోత్రారొస్సా మఠంకు బదిలీచేయబడ్డారు. వారిని దర్శించడానికి వచ్చి పోయే భక్త యాత్రికులతో వారు ఉన్న మఠదేవాలయం ఒక పుణ్యక్షేత్రంగా మారిపోవడం విశేషం. పిమ్మట ఆ మహానీయుని ఫొస్సొంబ్రోను ఊల్లో ఉన్న ఒక కపూచియను మఠంకు మార్చారు. చివరగా క్రీ||శ|| 1657లో వారి స్వంతసభ ఉన్న ఒసిమోపట్టణ మఠంకు బదిలీకాబడ్డారు. కఠోర సన్యాసి జీవితం గడపుతూ అందరికీ ఆదర్శప్రాయునిగా యో సేపుగారు జీవించారు.
40 రోజులు సాగే 7 తపస్కాలాలను పునీత కుపెర్డీనో యోసుపుగారు ప్రతియేడాది వరుసగా నిష్టగా పాటించారు. కటిక ఉపవాసము ఉండేవారు ఆ కాలంలో వారంలో గురువారం ఆదివారంలలో మాత్రమే శుద్ద మిత భోజనం చేసేవారు. అయినాగాని నిరాడంబర దేవుని మనిషిగా ఉల్లాసంగా కనిపించేవారు. ఎంత అద్భుత వ్యక్తియైనా వారికి అపవాదులు, అపార్దాలు అపాదించేవారు ఉండనే ఉండేవారు.
ఈ పుణ్యమూర్తి తన ఆశ్చర్యకర పనులు కొనసాగిస్తూనే ప్రజలను విశ్వాసంలో బలపరుస్తూనే తనకు కేటాయించిన గదిలో గురువుగా దివ్యబలిపూజలు అర్పించుకుంటు క్రీ||శ|| 1663 సెప్టెంబరు 18న తమ 60వ ఏట పరలోక రాజ్యం చేరుకున్నారు. 13వ క్లెమెంటు జగద్గురువులు వారికి క్రీ||శ|| 1767లో పునీత పట్టానిచ్చి కీర్తించారు.గాలిలో ఎగిరే అద్భుత శక్తి కలిగి యుండటాన ఆ పునీతుని ఆకాశమార్గ ప్రయాణీకులు, విమానం రాకెట్టుల పైలెట్లకు పాలక పునీతునిగా ఎంపిక చేయబడినారు. గ్రోటెల్లా పట్టణ దేవమాత భక్తుడుగా అక్కడి దేవాలయంలో వారి స్వరూపమును ఉంచి మర్యాదచూపడం భక్తులకు రివాజు అయ్యింది.
ఒసిమో పట్టణంలో మరణింపగా వారి పరిశుద్ద శరీరాన్ని ఒక గాజు పెట్టెలో భద్రపరుపబడి ఫ్రాన్సీసు మఠంవారి ఆస్థిగా అక్కడే ఆ పునీతుని పేరటగల దేవా లయములో ఖననం చేయబడింది. యోసేపు అనగా కూడుకొనుట, దేవుడు అధికముచేయుట అని అర్థం.
