12,200 జపమణులతో భారీ జపమాల.. దేవాలయ నిర్మాణం కోసం విశ్వాసుల ప్రార్థన

జోసెఫ్ అవినాష్
17 Sep 2026
కేరళలోని కోజికోడ్ అగ్ర పీఠానికి చెందిన చెరువన్నూర్ తిరుహృదయ దేవాలయంలో 12,200 జపమణులతో భారీ జపమాలను రూపొందించారు.నూతన దేవాలయ నిర్మాణం కోసం ప్రార్థిస్తూ, అక్టోబర్ నెలలో విచారణ విశ్వాసులంతా ఈ భారీ జపమాలతో దేవాలయం చుట్టూ చేరి జపమాల ప్రార్థన చేయనున్నారు.భక్తి,ఐక్యతతో కూడిన ఈ ప్రత్యేక ప్రార్థనా కార్యక్రమం ద్వారా కొత్త దేవాలయ నిర్మాణ పనులను దేవుని చేతుల్లో ఉంచి ఆయన ఆశీర్వాదాలను కోరాలని విశ్వాసులు భావిస్తున్నారు.ఈ భారీ జపమాలను విచారణకు చెందిన మార్తా, ఆమె తండ్రి వేలాంకణ్ణి కలిసి తయారు చేశారు. వివిధ ప్రసిద్ధ కతోలిక పుణ్యక్షేత్రాల నుంచి సేకరించిన జపమణులతో,ఉపవాస ప్రార్థనల మధ్య కేవలం వారం రోజుల్లోనే ఈ జపమాల తయారీని పూర్తి చేశారు.
