విశ్వాసం కోసం ప్రాణత్యాగం చేసిన వారి సాక్ష్యం నేటి ప్రపంచానికి వెలుగు: పోప్
జోసెఫ్ అవినాష్
16 Sep 2026
సెప్టెంబర్ 16న వాటికన్‌లో జగద్గురువుని పరిపాలన యంత్రాంగంలోని ఒకటైన పునీత పట్టమును ప్రకటించే విభాగం వారు 21వ శతాబ్దం: నూతన హతసాక్షుల యుగమా?” అన్న శీర్షికతో జరిపిన ప్రత్యేక సదస్సులో పోప్ లియో XIV ప్రసంగిస్తూ,నేటి కాలంలో క్రైస్తవ విశ్వాసం కోసం తమ ప్రాణాలను అర్పించిన విశ్వాస సాక్షుల గురించి ప్రస్తావించారు.అన్యాయం,అణచివేత,హింసను ఎదుర్కొంటూ క్రీస్తుపై విశ్వాసాన్ని చివరి వరకు విడిచిపెట్టని వారి జీవితం మనకు గొప్ప స్ఫూర్తినిస్తుందని అన్నారు.విశ్వాసం కోసం ప్రాణాలు కోల్పోయిన ప్రతి ఒక్కరి మరణానికి ప్రత్యక్షంగా మతపరమైన కారణమే ఉందని చెప్పడం సాధ్యం కాకపోయినా,వారి జీవితాల్లో కనిపించిన సత్యం,ప్రేమ,శాంతి,న్యాయం పట్ల నిబద్ధతను గుర్తించడం ముఖ్యమని పోప్ పేర్కొన్నారు.మాటలకు,చేతలకు మధ్య ఏకత్వంతో జీవించిన ఈ విశ్వాస సాక్షులు,ముఖ్యంగా నేటి ప్రపంచంలో క్రీస్తు వెలుగును ప్రతిబింబిస్తున్నారని ఆయన అన్నారు.ద్వేషానికి ద్వేషంతో కాకుండా ప్రేమతో,హింసకు బదులుగా సాత్వికతతో స్పందిస్తూ సత్యం కోసం నిలబడే వారి సాక్ష్యం నేటి క్రైస్తవులకు గొప్ప పిలుపుగా నిలుస్తుందని పోప్ లియో XIV వివరించారు.
