పుస్తకాల నిలయం మాత్రమే కాదు.. సంబంధాలు, ఆలోచనల వేదిక గ్రంథాలయం: పోప్
జోసెఫ్ అవినాష్
15 Sep 2026
గ్రంథాలయం అనేది కేవలం పుస్తకాలను భద్రపరిచే నిశ్శబ్ద ప్రదేశం మాత్రమే కాదని,అది మనుషుల మధ్య సంబంధాలు, ఆలోచనల మార్పిడి జరిగే వేదిక అని పోప్ లియో XIV అన్నారు.పుస్తకాలు మనకు ప్రశాంతతను అందించడంతో పాటు,కొత్త విషయాలను తెలుసుకోవాలనే ఆసక్తిని, ఆలోచించాలనే తపనను కూడా రేకెత్తిస్తాయని ఆయన పేర్కొన్నారు.ఒక పుస్తకాన్ని చదవడం ద్వారా మనం కేవలం సమాచారాన్ని పొందడం మాత్రమే కాకుండా,రచయిత ఆలోచనలతో,అనుభవాలతో ఒక రకమైన సంబంధాన్ని ఏర్పరచుకుంటామని తెలిపారు.అందువల్ల గ్రంథాలయాలు జ్ఞానాన్ని నిల్వచేసే ప్రదేశాలుగా మాత్రమే కాకుండా, సంభాషణ,పరస్పర అవగాహన,మానవ సంబంధాలను పెంపొందించే ప్రదేశాలుగా ఉండాలని పోప్ సూచించారు.
