క్షమాపణే నిజమైన శాంతికి మార్గం: పోప్
జోసెఫ్ అవినాష్
14 Sep 2026
పోప్ లియో XIV సెప్టెంబర్ 13న ఏంజెలస్ ప్రార్థన సందర్భంగా మాట్లాడుతూ,యేసుక్రీస్తు బోధించిన క్షమాపణ మార్గాన్ని క్రైస్తవులు తమ జీవితాల్లో ఆచరించాలని పిలుపునిచ్చారు. మనకు ఎవరి వల్లైనా బాధ,అన్యాయం లేదా అపార్థం ఎదురైనప్పుడు ద్వేషం,ప్రతీకారం పెంచుకోకుండా వారిని క్షమించేందుకు ప్రయత్నించాలని సూచించారు.క్షమించడం అంటే జరిగిన తప్పును సమర్థించడం కాదని,హృదయంలోని కోపం మరియు ద్వేషాన్ని విడిచిపెట్టి ప్రేమకు,శాంతికి స్థానం కల్పించడమేనని ఆయన అన్నారు.మనం దేవుని క్షమాపణను కోరుకుంటూనే ఇతరులను క్షమించడానికి నిరాకరించకూడదని గుర్తుచేస్తూ,వ్యక్తిగత సంబంధాల నుంచి సమాజాల మధ్య,దేశాల మధ్య ఉన్న సంఘర్షణల వరకు నిజమైన శాంతి ఏర్పడాలంటే ప్రేమ,క్షమాపణ,పరస్పర అవగాహన ఎంతో అవసరమని పోప్ లియో XIV స్పష్టం చేశారు.
